SIP Investment: రూ.5 లక్షలను రూ.కోటిగా మార్చే మార్గం.. ఎంత కాలం పడుతుంది..?

SIP Investment: రూ.5 లక్షలను రూ.కోటిగా మార్చే మార్గం.. ఎంత కాలం పడుతుంది..?

Mutual Fund Investment: ప్రజలు ప్రస్తుత కాలంలో పెట్టుబడులపై అవగాహన పెంచుకుంటూ కాంపౌండింగ్ ఆఫ్ మనీ విలువను, దాని ప్రాముఖ్యతను ప్రస్తుతం తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో పెట్టుబడుల విషయంలో క్రమశిక్షణ ఎంత అవసరం అనే అంశాన్ని చాలా మంది తెలుసుకుంటున్నారు. దీంతో క్రమంగా కరోనా తర్వాత మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెడుతున్న వారి సంఖ్య భారతదేశంలో పెరుగుతూ వచ్చింది. దీంతో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కింద పెట్టుబడులు పెట్టేందుకు అన్ని వయస్సుల వారు ముందుకు వస్తున్నారు. 

సెబీ కూడా ఇటీవలి కాలంలో సామాన్యుల పార్టిసిపేషన్ పెంచేందుకు సిప్ కనీస విలువను రూ.100కి తగ్గించాలని ఏఎంసీలకు సూచించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మార్కెట్లో రోజువారీ, వారం, నెలవారీ, త్రైమాసికానికి సంబంధించిన సిప్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే ప్రతినెల ఒక ఎంపిక చేసుకున్న తేదీన పెట్టుబడులు పెట్టే సిప్ చాలా పాపులారిటీని సంతరించుకుంది. ఇన్వెస్టర్ ఎంపిక చేసుకున్న తేదీని వారి బ్యాంక్ ఖాతా నుంచే నేరుగా డబ్బు డిడక్ట్ చేయబడుతుంది. ఏఎంసీలు దానిని ప్రాసెస్ చేసి సరిసమానమైన యూనిట్లను అందిస్తాయి.

Also Read:-10 నిమిషాల్లో ఇంటికి సిమ్​.. ఎయిర్​టెల్​తో బ్లింకిట్​ జోడీ..

మనలో చాలా మందికి సామాన్యంగా ఒక అనుమానం ఉంటుంది. అదేంటంటే కనీసం రూ.5 లక్షలు పెట్టుబడిగా పెట్టి దానిని రూ.కోటిగా మార్చటం కుదురుతుందా అన్నదే. అయితే దీనికి అనువననే సమాదానం చెప్పవచ్చు. దీనిని సాధించటానికి మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు ఒక మంచి మార్గంగా చెప్పుకోవచ్చు. దీనికోసం ఇన్వెస్టర్స్ కనీసం 12 శాతం రాబడిని తెచ్చిపెట్టే ఏదైనా ఫండ్ కింద ప్రతి నెల రూ.వెయ్యి 50 క్రమపద్దతిలో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఇదే మెుత్తాన్ని 40 ఏళ్లు లేదా 480 నెలలు కొనసాగిస్తే వారు పెట్టుబడి రూపంలో మెుత్తం రూ.5 లక్షల 4వేలు ఇన్వెస్ట్ చేస్తారు.

పైన పేర్కొన్న పెట్టుబడి సగటున 12 శాతం రాబడితో కాంపౌండింగ్ ఫ్యాక్టర్ ఎఫెక్ట్ కారణంగా 40 ఏళ్ల తర్వాత రూ.97 లక్షల 78వేల 725గా మారుతుంది. అంటే మనం ఇన్వెస్ట్ చేసిన రూ.5లక్షల 4వేలకు దీనిని కలిపితే మెుత్తం రాబడి విలువ రూ.కోటి 2లక్షల 82వేల 725గా చివరికి మారుతుంది. అంటే క్రమపద్ధతిలో తక్కువ మెుత్తాన్ని దాచుకున్నప్పటికీ ఇన్వెస్టర్లు దీర్ఘకాలంలో భారీ మెుత్తాలను చేతికి రాబడిగా అందుకునేందుకు వాస్తవంగా అవకాశం ఉందని ఇది నిరూపిస్తుంది. 

NOTE: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటి ఆధారంగా ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోల్లో పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకోవటానికి ముందుగా మీ ఆర్థిక సలహాదారులను సంప్రదించటం ఉత్తమం. మీరు తీసుకునే నిర్ణయాలకు V6 యాజమాన్యం లేదా ఉద్యోగులు ఎట్టిపరిస్థితుల్లోనూ బాధ్యత వహించరు.