Auto News: రూ.10 లక్షల బడ్జెట్లో బెస్ట్ సేఫ్టీ కారు కావాలా..? ఇవిగో టాప్-5 కార్ మోడల్స్..

Auto News: రూ.10 లక్షల బడ్జెట్లో బెస్ట్ సేఫ్టీ కారు కావాలా..? ఇవిగో టాప్-5 కార్ మోడల్స్..

Safest Cars: నేటి కాలంలో కారు కొనటం సర్వసాధారణంగా మారిపోయింది. అయితే ఒకప్పుడు మైలేజీకి ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తులు ప్రస్తుతం మాత్రం సేఫ్టీకి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వటం కనిపిస్తోంది. అందుకే 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ కార్ మోడళ్లకు మార్కెట్లో గిరాకీ కూడా పెరుగుతోంది. మీరు కూడా రూ.10 లక్షల బడ్జెట్లో సేఫ్టీ కారు కొనాలనుకుంటుంటే ఈ వివరాలు మీ కోసమే..

Kia Syros:
ముందుగా ఎక్కువ రేటున్న కియా సిరోస్ కారుతో ప్రారంభిద్దాం. ఇటీవలి కాలంలో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన మోడల్ సిరోస్. క్రాష్ టెస్టులో పెద్దలతో పాటు పిల్లలకు కూడా మంచి రక్షణ కలిగి ఉన్నట్లు తేలింది. కారు 6 ఎయిర్ బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, పెడస్ట్రియన్ ప్రొటెక్షన్, లెవెట్ 2 అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది. మార్కెట్లో ఈ కారు ఎక్స్ షోరూమ్ ధర రూ.9 లక్షల నుంచి ప్రారంభం అవుతోంది.

Also Read : జెన్సోల్‌లో ఇన్వెస్టర్ల డబ్బు దుబారా

Tata Nexon:
మార్కెట్లో కారు ప్రియులను ఎక్కువగా ఆకట్టుకున్న ఎస్‌యూవీగా టాటా నెక్సన్ నిలిచింది. దీనికి కారు పెర్ఫామెన్సుతో పాటు టాటాలపై ప్రజలకు ఉన్న బలమైన నమ్మకం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. సేఫ్టీ విషయంలో కారు పెద్దలకు, పిల్లలకు మంచి రక్షణ కలిగిస్తున్నట్లు తేలింది. ప్రస్తుతం ఈ కారు స్టార్టింగ్ ధర రూ.7లక్షల 99వేల నుంచి మెుదలవుతోంది. ఈ ఎస్‌యూవీ పెట్రోల్, డీజిల్, సీఎంజీ, ఎలక్ట్రిక్ వెర్షన్లలో అందుబాటులో ఉంది. పైగా టాటా నెక్సన్ సేఫ్టీ విషయంలో భారత ఆటో మార్కెట్లో కొత్త స్టాండర్డ్స్ సెట్ చేసి బెంచ్‌మార్క్‌గా నిలిచింది.

Mahindra XUV 3X0:
టాటాల తర్వాత దేశంలో మహీంద్రా గ్రూప్ ఆటో రంగాన్ని లీడ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మహీంద్రా ఎక్స్‌యూవీ 3X0 బడ్జెట్లో ఉన్న సెఫ్టీ కార్ల జాబితాలో చేరిపోయింది. ఇది కూడా భద్రత విషయంలో 5 స్టార్ రేటింగ్ సాధించి ప్రమాదాల సమయంలో పిల్లలకు, పెద్దలకు రక్షణను అందిస్తోంది. కారు ఎక్స్ షోరూమ్ ధర రూ.7 లక్షల 99వేలుగా ఉంది. ప్రస్తుతం కారు పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. కారులో 360 డిగ్రీల వ్యూవ్ కెమెరా, లెవెల్ 2 అడ్వాన్స్డ్ డ్రైవ్ అసిస్టెన్స్, 6 ఎయిర్ బ్యాక్స్ అందుబాటులో ఉన్నాయి. 

Skoda Kylaq:
ఇక 10 లక్షల రూపాయల బడ్జెట్లో సేఫ్టీ కారు కొనాలనుకుంటున్న  వారికి జర్మనీకి చెందిన వోక్స్‌వ్యాగన్ గ్రూప్ కి చెందిన స్కోడా నుంచి కైలాక్ కూడా ఉంది. ఈ కారు ఎక్స్ షోరూప్ ధర రూ.7 లక్షల 89 వేలుగా ఉంది. ఇది కూడా రక్షణ విషయంలో 5 స్టార్ రేటింగ్ దక్కించుకుంది. ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్స్ నుంచి 6 ఎయిర్ బ్యాంగ్స్ వరకు ఇందులో అందించింది కంపెనీ.

Tata Punch:
ఇక చివరిగా రూ.10 లక్షల లోపు బడ్జెట్లో మంచి సేఫ్టీ కారుగా టాటా పంచ్ నిలిచింది. ప్రస్తుతం ఈ కారు ఎక్స్ షోరూమ్ ధర రూ.6 లక్షల 19వేల నుంచి స్టార్ట్ అవుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో అత్యధిక సంఖ్యలో సేల్స్ నమోదు చేసిన మోడల్ టాటా పంచ్. ఈ కారు పెట్రోల్, సీఎన్జీ, ఈవీ మోడళ్లలో అందుబాటులో ఉంది. ఇక సేఫ్టీ విషయానికి వస్తే టాటాలకు చెందిన ఈ కారు 5 స్టార్లను సంపాదించింది.