Mukesh Ambani: అంబానీ పర్సనల్ డ్రైవర్ జీతం ఎన్ని లక్షలో తెలుసా..?

Mukesh Ambani: అంబానీ పర్సనల్ డ్రైవర్ జీతం ఎన్ని లక్షలో తెలుసా..?

Ambani Driver Salary: దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త, ప్రపంచ కుబేరుల్లో చోటు దక్కించుకున్న ముఖేష్ అంబానీ చాలా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఆయన నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆయిల్ వ్యాపారం నుంచి ఫ్యాషన్ వరకు అనేక రంగాల్లోకి విస్తరించింది. ప్రస్తుతం ఆయన కుటుంబం ముంబై నగరంలోని అత్యంత ఖరీదైన ఆంటిలియాలో నివసిస్తున్నారు. దీని విలువ రూ.15వేల కోట్లుగా అంచనా వేయబడింది.

అంబానీకి ఈ క్రమంలో కార్లంటే కూడా అంతే ఇష్టం. ముఖేష్ గ్యారేజీలో దాదాపు 168 వివిధ కార్లు ఉన్నాయి. అయితే అంబానీ కారు నడిపే డ్రైవర్ కి కూడా ఎక్కువ వేతనం ఉంటుందని తెలుస్తోంది. ఈ క్రమంలో ఉద్యోగులకు కేవలం జీతం మాత్రమే కాకుండా అనేక ఇతర బెనిఫిట్స్ కూడా అందించబడతాయని తెలుస్తోంది. 103 బిలియన్ డాలర్ల సంపద కలిగిన అంబానీ కుటుంబం ప్రతిరోజూ అత్యంత ఖరీదైన, భద్రత కలిగిన బుల్లెట్ ప్రూఫ్ కార్లలో ప్రయాణిస్తుంటారు. పైగా వీరికి ప్రైవేటు సెక్యూరిటీ, బాడీగార్డ్స్ కూడా ఉంటారు.

Also Read:-పుష్ప-2 సాంగ్కు కేజ్రీవాల్..భాంగ్రా డ్యాన్స్కు పంజాబ్ సీఎం స్టెప్పులు

హిందుస్థాన్ టైమ్స్ నివేదిక ప్రకారం అంబానీ పర్సనల్ డ్రైవర్ వేతనం 2017లో నెలకు రూ.2 లక్షలుగా ఉంది. అయితే ప్రస్తుతం అది మరింతగా పెరిగి ఉంటుంది. అనేక కార్పొరేట్ కంపెనీల్లో పనిచేసే సీనియర్ ఉద్యోగులకు ఏమాత్రం తీసిపోకుండా అంబానీ తన డ్రైవర్లకు వేతన చెల్లింపులు చేస్తున్నారు. దీనికి అదనంగా వారికి ఇన్సూరెన్స్ బెనిఫిట్స్, బోనస్, ఇతర అలవెన్సులు కూడా అంటాయి.

అంబానీ తన డ్రైవర్లను ప్రైవేటు ఏజెన్సీ ద్వారా నియమించుకుంటారని తెలుసింది. పర్సనల్ సేఫ్టీ విషయంలో వారు పూర్తిగా ట్రైనింగ్ పొందాక మాత్రమే పంపబడతారు. కమర్షియల్ వాహనాల నుంచి లగ్జరీ కార్ల వరకు అన్నింటిని నడపగలిగే సామర్థ్యం వారికి ఉంటుంది. అలాగే ఎలాంటి అనుకోని పరిస్థితులు ఎదురైనా వాటిని అధిగమించేలా వారికి శిక్షణ ఇవ్వబడుతుంది. పైగా వారు నిడిపే అంబానీ వాహనాలు అత్యంత రక్షణ కలిగిన బుల్లెట్ ప్రూఫ్ టెక్నాలజీని కలిగి ఉంటాయని తెలుస్తోంది.