బ్లడ్​ మూన్​2025 : తొలి చంద్రగ్రహణం తేదీ.. సమయం ఎప్పుడు.. భారతదేశంలో గ్రహణ ప్రభావం ఉంటుందా.. ఉండదా..!

బ్లడ్​ మూన్​2025 : తొలి చంద్రగ్రహణం  తేదీ.. సమయం ఎప్పుడు.. భారతదేశంలో గ్రహణ ప్రభావం ఉంటుందా.. ఉండదా..!

ఈ సంవత్సరంలో ( 2025)  మొదటి గ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. చంద్రగ్రహణం  మార్చి 14న హోలీ పండుగ రోజు  అంతరిక్షంలో అరుదైన ఘటన ఆవిష్కృతం కాబోతుంది. దాదాపు రెండేళ్ల తర్వాత సంపూర్ణ చంద్రగ్రహణం రాబోతుంది. సుదీర్ఘ విరామం తర్వాత ‘బ్లడ్ మూన్’గా పిలిచే సంపూర్ణ చంద్రగ్రహణం  మార్చి 14న ఏర్పడుతుంది. సరిగ్గా హోలి రోజున ఈ చంద్ర గ్రహణం ఏర్పడుతుండటం విశేషమని జ్యోతిష్కులు చెబుతున్నారు.

భూమి.. సూర్యుడికి, చంద్రుడికి నేరుగా మధ్య ఉన్నప్పుడు చంద్ర గ్రహణం సంభవిస్తుంది. దాని నీడ చంద్రునిపై పడుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో పాక్షిక, సంపూర్ణ చంద్రగ్రహణంగా కనిపిస్తుంది. అంటే, చంద్రుని కాల వ్యవధిని కక్ష్యలో దాని స్థానం ఆధారంగా లెక్కిస్తారు.  ఇలా రావడం  అనేది ఒక ఖగోళ సంఘటన.

 సంపూర్ణ చంద్రగ్రహణ సమయం

  • మార్చి 14 ఉదయం 9.29 గంటలకు ప్రారంభం 
  • మార్చి 14 మద్యాహ్నం 3.39 గంటలకు ముగింపు 
  • చంద్రగ్రహణం గరిష్ట స్థాయి సమయం : 12.29 గంటలకు
  • చంద్రగ్రహణం మొత్తం దశ ప్రారంభం : 11.57 గంటలకు
  • చంద్రగ్రహణం మొత్తం దశ ముగింపు:  మధ్యాహ్నం 1.01 గంటలకు
  • సాధారణంగా చంద్రగ్రహణం వివిధ దశల్లో దాదాపు 6 గంటల పాటు ఉంటుందని  శాస్త్రవేత్తలు చెబుతున్నారు


సాధారణంగా గ్రహణాల రోజుల్లో చంద్రుడు కాస్త పెద్దగా, ఎప్పుడూ కనిపించే రంగులోనే కనిపిస్తాడు. కానీ బ్లడ్ మూన్ రోజున చంద్రుడు పూర్తిగా ఎర్రగా లేదా ఆరెంజ్ కలర్‌లో దర్శనమిస్తాడు. సూర్యుడి నుంచి విడుదలయ్యే రెడ్, ఆరెంజ్ కిరణాలు భూమి వాతావరణం గుండా వెళ్లి చంద్రుడిని ప్రకాశింపజేస్తాయి. దీనినే రేలీ స్కాటరింగ్ అని కూడా పిలుస్తారు. సంపూర్ణ చంద్రగ్రహణం సమయంలో భూమి నీడ చంద్రుడిని పూర్తిగా కప్పేయడంతో చంద్రుడు ఇలా ఎర్రగా లేక ఆరెంజ్ రంగులో కనిపిస్తాడు.

ఈ సంపూర్ణ చంద్రగ్రహణాన్ని మన దేశంలో చూడలేం. ఎందుకంటే ఇది పశ్చిమార్థ గోళంలో పూర్తిగా, అక్కడక్కడా పాక్షికంగా కనిపిస్తుంది. ఈ ప్రాంతాల పరిధిలో మన దేశం లేనందున పగటి పూట ఈ గ్రహణం సంభవిస్తుంది. అందుకే ఇండియా నుంచి ఈ సంపూర్ణ గ్రహణాన్ని మనం చూడలేమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

బ్లడ్ మూన్ ఎక్కడ కనిపిస్తుంది? 

ఈ బ్లడ్ మూన్ పశ్చిమ అర్ధగోళం (Western Hemisphere) లోని ప్రజలకు సంపూర్ణంగా కనిపిస్తుంది.ముఖ్యంగా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, పశ్చిమ యూరప్, ఆఫ్రికా దేశాల్లోని ప్రజలు ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించగలరు.అమెరికాలో ఎక్కువ ప్రాంతాల్లో గ్రహణం స్పష్టంగా కనిపిస్తుంది. 

యూరప్‌లో గ్రహణ దశలో చంద్రుడు అస్తమించనుండగా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో గ్రహణం పూర్తయ్యే సమయంలో చంద్రుడు ఉదయిస్తాడు.ఈ గ్రహణాన్ని చూడడానికి టెలిస్కోప్‌లు లేదా బైనాక్యులర్స్ ఉపయోగిస్తే మరింత స్పష్టంగా వీక్షించగలరు. అయితే, లైట్ పొల్యూషన్ లేని ప్రాంతాల్లో ఈ దృశ్యం అద్భుతంగా అనిపిస్తుంది.