Stocks to Buy: పతనాల మార్కెట్లో నిలిచిన10 స్టాక్స్.. 36% లాభం, లిస్ట్ ఇదిగోండి..

Stocks to Buy: పతనాల మార్కెట్లో నిలిచిన10 స్టాక్స్.. 36% లాభం, లిస్ట్ ఇదిగోండి..

2025 Stocks: నేడు భారతీయ స్టాక్ మార్కెట్లకు మహావీర్ జయంతి కారణంగా సెలవులో ఉన్నాయి. దీంతో ఎన్ఎస్ఈ, బీఎస్ఈ నేడు పనిచేయవు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనాపై 125 శాతం పన్ను పెంచటంతో పాటు ప్రపంచంలోని చాలా దేశాలపై టారిఫ్స్ 90 రోజుల వరకు వాయిదా వేయనున్నట్లు ప్రకటించటంతో ప్రపంచ మార్కెట్లు ఊపిరి పీల్చుకున్నాయి. ఈ క్రమంలోనే మార్కెట్ల పతనంలో ఇన్వెస్టర్లకు 2025లో బెస్ట్ లాభాలను అందించిన స్టాక్స్ జాబితా ఇక్కడ ఉంది. ఈ షేర్లు మార్కెట్ డిప్స్ వద్ద కొనుగోలుకు అనుకూలమైనవిగా పరిగణించబడుతున్నాయి. 

1.Godfrey Philips India
గాడ్‌ఫ్రే ఫిలిప్స్ ఇండియా స్టాక్ జనవరి 1, 2025న రూ.5వేల 035.20 వద్ద ఉండగా బుధవారం రూ.6వేల 870 వద్ద ముగియడంతో.. ఇది 2025 సంవత్సరంలో 36.44 శాతం రాబడిని ఇచ్చింది. 

2. Narayana Hrudaya Limited
నారాయణ హృదయ లిమిటెడ్ కంపెనీ స్టాక్ మార్కెట్ క్షీణించినప్పటికీ 2025లో ఇప్పటి వరకు 28 శాతానికి పైగా పెరిగి రూ.వెయ్యి685కి చేరుకుంది. ప్రస్తుతం స్టాక్ తన 52 వారాల గరిష్ఠానికి చేరువలో ఉంది. 

3.Bajaj Finance
బజాజ్ ఫైనాన్స్ షేర్లు కూడా 2025లో 26 శాతం కంటే ఎక్కువ రాబడిని ఇవ్వగలిగాయి. ఈ కాలంలో ఒక్కో షేరుకు రూ.వెయ్యి809.70 రాబడిని అందించింది. బుధవారం స్టాక్ ధర ఒక్కోటి మార్కెట్ల ముగింపు నాటికి రూ.8వేల745 వద్ద ఉంది.

4.Chambal Fertilizer
ఎరువుల తయారీ సంస్థ చంబల షేర్లు ఈ సంవత్సరం ఇప్పటివరకు 26.28 శాతం పెరిగి ఇన్వెస్టర్లకు నష్టాల మార్కెట్లో లాభాలను రుచి చూపించింది. ఈ కాలంలో ఒక్కో షేరుకు రూ.132.35 రాబడిని అందించగా.. నిన్న మార్కెట్లు ముగిసే నాటికి స్టాక్ ధర ఒక్కోటి రూ.636 వద్ద ఉంది.

5.SBI Cards
2025 ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఎస్బీఐ కార్డ్స్ కంపెనీ షేర్లు 25 శాతం బలమైన రాబడిని అందించాయి. దీంతో బుధవారం ఈ స్టాక్ రూ.847 వద్ద ప్రయాణాన్ని ముగించింది.

6.Aavas Financiers
ఆవాస్ ఫైనాన్షియర్స్ స్టాక్ ఈ ఏడాది ప్రారంభం నుంచి నిన్నటి వరకు దాదాపు 22 శాతం పెరిగింది. ఈ కాలంలో ఒక్కో షేరుకు రూ.362.15 లాభాన్ని అందించాయి. బుధవారం మార్కెట్ల ముగింపు నాటికి స్టాక్ ధర ఒక్కోటి రూ.2వేల 040 వద్ద ఉంది.

7.GSK Pharma
జీఎస్‌కే ఫార్మా షేరు ఫార్మా స్టాక్స్ కుప్పకూలుతున్నప్పటికీ కొత్త సంవత్సరంలో19 శాతం కంటే ఎక్కువ రాబడిని అందించాయి. బుధవారం ఈ ఫార్మా స్టాక్ రూ.2వేల 663.35 వద్ద తన ప్రయాణాన్ని ముగించింది. 

8.Sri Cement
నిన్న మార్కెట్ల క్లోజింగ్ సమయంలో శ్రీ సిమెంట్ షేర్లు రూ.30వేల 300.40 వద్ద ముగిశాయి. ఈ సంవత్సరం ఇప్పటివరకు స్టాక్ రూ.4వేల 796.15  రాబడిని అందించింది.

9.Manappuram Finance
మణప్పురం ఫైనాన్స్ కంపెనీ బంగారం తాకట్టుపై రుణాలను అందించే కంపెనీ. స్టాక్ ఈ సంవత్సరం ఇప్పటి వరకు తన పెట్టుబడిదారులకు దాదాపు17 శాతం కంటే ఎక్కువ రాబడిని అందించాయి. ఈ క్రమంలో నిన్న ఒక్కో షేరు రూ.224.81 వద్ద ముగిసింది.

10.Interglobe Aviation
ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ షేర్లు కూడా ఈ సంవత్సరం సానుకూల రాబడిని అందించగలిగాయి. 2025లో ఇప్పటివరకు కంపెనీ షేర్లు13 శాతం రాబడిని తెచ్చిపెట్టాయి. అయితే నిన్న మార్కెట్లు ముగిసే సమయానికి స్టాక్ ధర ఒక్కోటి రూ.5వేల194.90గా ఉంది.

NOTE: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటి ఆధారంగా ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోల్లో పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకోవటానికి ముందుగా మీ ఆర్థిక సలహాదారులను సంప్రదించటం ఉత్తమం. మీరు తీసుకునే నిర్ణయాలకు V6 యాజమాన్యం లేదా ఉద్యోగులు ఎట్టిపరిస్థితుల్లోనూ బాధ్యత వహించరు.