ఆంధ్రా అల్లుడు.. అమెరికా ఉపాధ్యక్ష రేసులో.. ఎవరంటే..?

ఆంధ్రా అల్లుడు.. అమెరికా ఉపాధ్యక్ష రేసులో.. ఎవరంటే..?

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఎన్నికల జోరు కొనసాగుతుంది.  అధ్యక్ష పదవికి రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్‌ ట్రంప్‌ పేరు అధికారికంగా ఖరారైంది. పార్టీ జాతీయ సదస్సులో ప్రతినిధులంతా ఆయనకు మద్దతు పలికారు. ఉపాధ్యక్ష పదవికి జే. డీ. వాన్స్ పేరును అభ్యర్ధించారు. ఇందుకు పార్టీ ప్రతినిధులు కూడా ఓకే చెప్పారు. దీంతో అధ్యక్ష ఉపాధ్యక్ష పదవిపై రిపబ్లికన్ పార్టీ కన్ఫమేషన్ ఇచ్చింది. 

ఈ క్రమంలోనే ఉపాధ్యక్ష పదవి రేస్ లో ఉన్న జే. డీ వాన్స్ వ్యక్తిగత వివరాలు బయటకొస్తున్నాయి. వాన్స్ భార్య ఉషా వాన్స్ భారత సంతతికి చెందిన వ్యక్తి. ఆమె తల్లిదండ్రుల భారత్‌ లోని ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లి అమెరికాలో స్థిరపడ్డారు. అమెరికా ఉపాధ్యక్ష రేస్ లో ఉన్న వ్యక్తి భార్య ఇండియన్ కావడం భారతీయులకు మరింత ఆనందం కలిగేవిధంగా చేస్తుంది. 

ALSO READ : చెవికి బ్యాండేజ్ తో ట్రంప్.. కాల్పుల తర్వాత తొలి సారి ఇలా..

మొన్నటిదాక బ్రిటన్ ప్రధానిగా ఉన్న రిషీ సునక్.. భారత సంతతికి చెందిన వ్యక్తే.. ఆ తర్వాత అమెరికా అధ్యక్ష పదవి కోసం పార్టీ తరపున టికెట్ ఆశించి నిరాశ పొందిన వివేక్ రమస్వామి.. ఇలా భారతీయులు ముఖ్యంగా తెలుగు నేలకు చెందిన వ్యక్తులు ఇతర దేశాల ప్రధానమంత్రుల రేస్ లో.. అధ్యక్ష రేస్ లో ఉండటం గర్వకారణమని నెటిజన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తు్న్నారు.