మీకు మ్యూచువల్ ఫండ్స్‌లో SWP ఆప్షన్ గురించి తెలుసా..? బోలెడు ప్రయోజనాలు..!

మీకు మ్యూచువల్ ఫండ్స్‌లో SWP ఆప్షన్ గురించి తెలుసా..? బోలెడు ప్రయోజనాలు..!

SWP in Mutual Funds: నేటి కాలంలో చాలా మంది ప్రజలు మ్యూచువల్ ఫండ్స్ ను ఒక ముఖ్యమైన పెట్టుబడి సాధనంగా వినియోగిస్తున్నారు. ఆర్థిక అంశాలపై ప్రజల్లో నిరంతరం పెరుగుతున్న అవగాహన ఇన్వెస్టర్లను వీటి వైపుకు నిడిపిస్తోంది. అయితే ఈ క్రమంలో మ్యూచువల్ ఫండ్స్ అందించే వివిధ ప్రయోజనకరమైన ఆప్షన్ల గురించి కూడా తెలుసుకోవటం ముఖ్యం. 

ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది సిస్టమ్యాటిక్ విత్‌డ్రాయెల్ ప్లాన్(SWP) గురించే. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులు తమ స్కీమ్ పెట్టుబడి మెుత్తం నుంచి ప్రతి నెల, ప్రతి త్రైమాసికంలో ఎంపిక చేసుకున్న మెుత్తాన్ని క్రమం తప్పకుండా విత్ డ్రా చేసుకునేందుకు అందించే ఒక వెసులుబాటు. వాస్తవానికి దీనిని రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం ఎక్కువ మంది ఉపయోగించుకుంటుంటారు. వాస్తవానికి ఇది సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ కి పూర్తిగా వ్యతిరేకంగా వ్యవహరిస్తుంది. SWP విధానంలో డబ్బు పెట్టుబడిదారుని బ్యాంక్ ఖాతాలోనికి నేరుగా జమవుతాయి. 

ఉదాహరణకు ఎవరైనా వ్యత్తి రూ.10 లక్షలు మ్యూచువల్ ఫండ్ స్కీమ్ కింద పెట్టుబడి పెట్టినట్లయితే.. SWP కింత ప్రతినెల రూ.10వేలు వెనక్కి తన ఖాతాలోకి పొందేలా ప్లాన్ చేసుకోవచ్చు. అలా తమకు నచ్చిన మెుత్తన్ని క్రమం తప్పకుండా వెనక్కి తీసుకోవటం ద్వారా పెట్టుబడిదారులు తమ అవసరాలకు ఆ మెుత్తాన్ని ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ విత్ డ్రా చేయబడిన మెుత్తానికి సరిపడా విలువ కలిగిన యూనిట్లు ప్రతినెల మ్యూచువల్ ఫండ్ కంపెనీ విక్రయిస్తుంటుంది. ఈ ప్రక్రియకు రెండు రోజుల వరకు సమయం పట్టే అవకాశం ఉంది. ఇదే సమయంలో మిగిన పెట్టుబడి మెుత్తం మాత్రం సదరు ఫండ్ కింద అలాగే కొనసాగుతూ ఉంటుంది. అంటే ఇది పెట్టుబడితో పాటు పెన్షన్ బెనిఫిట్స్ ఏకకాలంలో ఇన్వెస్టర్లకు అందిస్తుంది.

SWP విత్ డ్రాలపై క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ డివిడెండ్ల కంటే భిన్నంగా ఉంటుంది. ఇది తరచుగా తక్కువ పన్ను బాధ్యతకు కలిగిస్తుంది. ఈ విధానంలో మ్యూచువల్ ఫండ్ స్కీమ్ యూనిట్లు క్రమపద్ధతిలో రిడీమ్ చేయబడతాయి. ఇది మార్కెట్ అస్థిరత ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే అవసరాలకు అనుగుణంగా మీరు విత్ డ్రా మెుత్తాన్ని కావలసినన్ని సార్లు మార్చుకోవచ్చు. అలాగే మీకు అక్కర్లేదనుకుంటే విత్ డ్రాలను నిలుపుదల చేసేందుకు వీలు ఉంటుంది. అలాగే పెట్టుబడిని కావాలనుకున్నప్పుడు పూర్తిగా కూడా వెనక్కి తీసుకోవచ్చు లేదా ఇతర ఫండ్లలో పెట్టుబడికి మార్చుకోవచ్చు.