
F1 Visa Revocation: ప్రస్తుతం అమెరికాలో ట్రంప్ చెప్పిందే రూల్ అన్నట్లుగా అక్కడి అధికారులు వ్యవహరిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశంలోని అనేక ప్రాంతాల నుంచి విద్యార్థులు ప్రతి ఏటా ఉన్నత చదువుల కోసం, చదువు తర్వాత ఉద్యోగం సంపాదించి అక్కడే స్థిరపడటం కోసం అమెరికాకు వెళుతుంటారు. అలా కోటి ఆశలతో స్టూడెంట్ వీసా సంపాదించిన చాలా మంది ప్రస్తుతం వీసాలను అధికారులు క్యాన్సిల్ చేయటంతో డిపోర్ట్ అవుతున్నారు. అసలు ఏ తప్పులు చేస్తే గతంలో విద్యార్థుల వీసాలను అమెరికా అధికారులు క్యాన్సిల్ చేసేవారనే విషయాన్ని మనకు తప్పకుండా తెలిసుండాలి.
వాస్తవానికి F-1 వీసా విదేశీ విద్యార్థులకు అమెరికాలో స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ కింద ధృవీకరించబడిన పాఠశాలల్లో ఫుల్ టైం చదువుకోవడానికి అనుమతిని కల్పిస్తుంది. అయితే వీసా కఠినమైన షరతులతో వస్తుంది. వాటిలో దేనినైనా అనుకోకుండా ఉల్లంఘించినా సరే వారి వీసా క్యాన్సిల్ కావటంతో పాటు వారు కొన్నిసార్లు వారు బహిష్కరణకు గురయ్యేవారు. ట్రంప్ అధికారంలోకి రాక మును ఉన్న ప్రెసిడెంట్స్ స్టూడెంట్స్ వీసా రిజెక్ట్ చేయటానికి ఫాలో అయిన రూల్స్ పరిశీలిస్తే..
* వీసా పొందిన విద్యార్థి ఫుల్ టైం కోర్సులో చేరకపోవటం
* అకడమిక్స్ లో వెనుకబడిన కారణంగా విద్యార్థి సస్పెన్షల్ లేదా బహిష్కరణకు గురికావటం లేదా చదువుతున్న యూనివర్సిటీలో క్రమశిక్షణ చర్యలకు గురికావటం
* విద్యార్థులు అనుమతించిన పరిమితులకు మించి అనధికారిక ఉపాధిని పొందటం లేదా ఆమోదం లేకుండా జాబ్ చేయటం
* ఏదైనా నేరాలకు పాల్పడి అరెస్టుకు గురికావటం లేదా నేరారోపణలు ఎదుర్కోవటం వీసా రద్దుకు కారణంగా మారవచ్చు
* వీసా గడువు ముగిసినప్పటికీ అమెరికాలోనే నివసించటం
* అమెరికాలో విద్యను కొనసాగించటానికి, అక్కడ జీవించటానికి అవసరమైన ఆర్థిక నిధులను సమకూర్చుకోలేకపోవటం
* నకిలీ అడ్మిషన్ లెటర్, పరీక్షల మార్కులు లేదా ఇతర తప్పుడు సమాచారాన్ని అధికారులకు అందించటం
* విద్యార్థులు అమెరికాలో తమ నివాసానికి సంబంధించిన అడ్రస్, మెయిల్ వంటి వివరాల మార్పులను 10 రోజుల్లో అధికారులకు అందించకపోవటం
* అమెరికాలోని భద్రత అధికారులు లేదా నిఘా ఏజెన్సీలు విద్యార్థి వల్ల ముప్పు లేదా ప్రమాదం పొంచి ఉన్నట్లు గుర్తించటం
* ఎఫ్ 1 వీసాపై ఉన్న వ్యక్తి ఫ్యామిలీ అంటే జీవితభాగస్వామి ఎఫ్2 వీసాపై ఉంటూ అనుమతి లేకుండా ఉద్యోగం చేయటం
* విద్యార్థి చదువుతున్న కాలేజ్ కోర్సుల విషయంలో ఏదైనా మార్పులను 60 రోజుల్లోగా వెల్లడించకపోవటం
* అధికారిక SEVIS నోటిఫికేషన్ లేకుండా విద్యార్థి ప్రోగ్రామ్ పార్ట్-టైమ్, హైబ్రిడ్ లేదా ఆన్‌లైన్‌గా మార్పులు చేసుకోవటం
* విద్యార్థి పనిచేస్తున్న లేదా ఇంటర్న్ గా ఉన్న సంస్థపై అమెరికా ఏదైనా ఆంక్షలు తర్వాతి కాలంలో విధిస్తే వీసా రద్దుకు దారితీయవచ్చు
అయితే ప్రస్తుతం కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి కారణాల కింద అక్కడి అధికారులు విద్యార్థుల ఎఫ్1 వీసాలను క్యాన్సిల్ చేస్తూ సెస్ఫ్ డిపోర్టేషన్ మెయిల్స్ పంపుతున్నారనే విషయాలను ఇప్పుడు గమనిద్దాం..
* ఏదైనా ట్రాఫిక్ రూల్స్ పాటించకపోయినా, లేదా గతంలో ఏదైనా కేసులు ఉంటే ఎలాంటి సమాచారం లేకుండా వీసా రిజెక్ట్ చేస్తూ సడెన్ మెయిల్
* పాలస్తీనాకు అనుకూలంగా పొలిటికల్ యాక్టివిజమ్, లేదా హమాస్ వంటి సంస్థలకు సపోర్ట్ చేయటం. ఇలాంటి కారణాలతో టర్కిష్ గ్రాడ్యుయేట్లను టుఫ్ట్స్ యూనివర్సిటీ నుంచి డిపోర్ట్ చేశారు.
* సోషల్ మీడియాలో ఏదైనా చిన్న పొరపాట్లు లేదా హమాస్ వంటి సంస్థలకు సపోర్ట్ చేయటం, యూనివర్సిటీల్లో ఏదైనా ప్రొటెస్ట్స్ చేస్తే వాటికి పరోక్షంగా లైక్ షేర్ వంటి చర్యలతో సపోర్ట్ చేయటం కూడా విద్యార్థులు వీసాలు కోల్పోవటానికి కారణంగా మారింది. ఏదైనా అమెరికాకు వ్యతిరేకంగా జరిగే క్యాంపెన్స్ కి సపోర్ట్ చేయటం కూడా అధికారుల మానిటరింగ్ లో గమనించబడుతోంది
* కొన్ని దేశాలకు సంబంధించిన విద్యార్థుల వీసాలను అమెరికా అధికారులు ప్రస్తుతం క్యాన్సిల్ చేస్తున్నారు. ఇటీవల సౌత్ సుడాన్ పాస్ పోర్ట్ కలిగిన విద్యార్థులను అధికారులు టార్గెట్ చేశారు
* అమెరికాలో టెంపరరీ వీసాలపై ఉపాధి పొందుతున్న విదేశీ వ్యక్తులకు పుట్టిన పిల్లలకు ట్రంప్ తీసుకొస్తున్న బర్త్ రైట్ సిటిజన్ షిప్ క్యాన్సిల్ కారణంగా
* ఏవైనా కారణాలతో వీసా క్యాన్సిల్ అయినట్లు అధికారుల నుంచి సమాచారం అందినప్పుడు ఆ వివరాలను యూనివర్సిటీ లేదా కాలేజీతో పంచుకోకపోవటం. ఇది సదరు విద్యార్థులకు లీగల్ సపోర్ట్ చేయటంలో కాలేజీలకు సమయం లేకుండా చేస్తోంది.
* విద్యార్థి అమెరికాలో నివసించటానికి అనర్హుడిగా బోర్డ్ అధికారులు లేదా కాన్సులేట్ పేర్కొన్నప్పుడు ఎలాంటి సమయం ఇవ్వకుండా వీసాను వెంటనే క్యాన్సిల్ చేయటం.
* హోమ్లాండ్ సెక్యూరిటీ, ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ అధికారుల ఆడిట్ సమయంలో విద్యార్థులకు సంబంధించి రికార్డుల్లో ఏవైనా తేడాలు గుర్తిస్తే వెంటనే వారి వీసా రిజెక్ట్ చేయబడుతోంది.