Drink milk on an Empty Stomach: పరకడుపున పాలు తాగుతున్నారా..? హెల్త్కు మంచిదో, కాదో ఇన్నాళ్లకు తెలిసింది..!

‘పొద్దున్నే లేవగానే ఒక కప్పు ఛాయ్ తాగందే నా డే స్టార్ట్ అవదు తెలుసా’ అని వెంకీ సినిమాలో మీమర్స్ ఫేవరెట్ డైలాగ్ ఒకటుంటుంది. కప్పు ఛాయ్ తాగేవాళ్లు మాత్రమే కాదు ఒక గ్లాసు పాలతో డే స్టార్ట్ చేసేవాళ్లు కూడా మన దేశంలో కోట్లలో ఉన్నారు. ఆరోగ్యానికి పాలు ఎంత మంచి చేస్తాయో మనందరికీ తెలుసు. బలవర్ధకమైన, శరీరానికి శక్తినిచ్చే ఆహార పదార్థాల్లో పాలు కూడా ఒకటి. పాలల్లో శరీరానికి మేలు చేసే క్యా్ల్షియం, ప్రొటీన్స్, కొవ్వు పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఎముకలు గట్టిపడటానికి, శరీరం కండపట్టడానికి, బాడీ యాక్టివ్గా ఉండటానికి పాలు తాగుతుంటారు. మన బుర్రకు మేలు చేసే విటమిన్ డి కూడా పాలల్లో ఉంటుంది. అయితే పాలు తాగే విషయంలో చాలామందికి ఉండే కామన్ డౌట్ ఏంటంటే.. పొద్దుపొద్దున్నే పరకడుపున టీ, కాఫీ తాగినట్టు పాలు తాగొచ్చా..? అలా పాలు తాగడం మంచిదా.. కాదా..? బెడ్ కాఫీలా మిల్క్ తాగితే ఏం కాదా..? ఈ డౌట్స్కు సింపుల్ ఆన్సర్ ఏంటంటే.. పాలు ఉదయాన్నే తాగుతారా లేదా రాత్రి పడుకోబోయే ముందు తాగుతారా అనేది పూర్తిగా తాగే వాళ్ల ఇష్టం. కాకపోతే.. ఉదయాన్నే పాలను పరకడుపున తాగడం వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి. కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. అవేంటంటే..

పరకడుపున పాలు తాగడం వల్ల లాభాలు:


ఉదయం నిద్ర లేవగానే ఏం తినక ముందే పాలు తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగవుతుంది. ఎముకలు బలహీనంగా ఉన్నవారికి, కండ బలం లేని వారికి ఉదయాన్నే పాలు తాగడం ఎంతో మేలు చేస్తుంది. బరువు పెరగాలని భావిస్తున్న వారు పరకడుపున పాలు తాగితే మెరుగైన ఫలితాలను త్వరితగతిన చూస్తారు.

పరకడుపున పాలు తాగడం వల్ల నష్టాలు:


ఉదయాన్నే పాలు తాగడం కొందరి ఆరోగ్యానికి నష్టం కూడా చేస్తుంది. పాలల్లో ఉండే ల్యాక్టోస్ కొందరికి పడదు. అలాంటి వాళ్లు ఉదయాన్నే పాలు తాగితే కడుపు నొప్పి, డయేరియా, గ్యాస్ సమస్యలతో ఇబ్బందిపడతారు. అంతేకాదు.. కొందరు ఉదయాన్నే పాలు తాగితే ఎసిడిటీ, గుండెల్లో మంట అనిపిస్తుంది. అయినా సరే.. ఉదయాన్నే పాలు తాగాలనుకునే భావించే వాళ్లు వేడి పాలను తాగడం కంటే పచ్చి పాలను తాగడం బెటర్. పచ్చి పాలను తాగితే జీర్ణ వ్యవస్థకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎసిడిటీ సమస్య తలెత్తే అవకాశం చాలా చాలా తక్కువ.

ALSO READ | Telangana Kitchen : వానాకాలంలో కారం కారంగా.. వెరైటీ కారాలు ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు..!

ఇక.. పాలు తాగడానికి ఆరోగ్యకరమైన సమయం ఎప్పుడనే విషయానికొస్తే.. ఉదయాన్నే పాలు తాగే ముందు కొన్ని ఫ్రూట్స్ గానీ, బ్రేక్ ఫాస్ట్ గానీ చేస్తే మంచిది. ఎలాంటి ఫుడ్ తినకుండా పరకడుపున పాలు తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. బరువు తగ్గాలని భావించేవారికి అసలు మంచిది కాదు. నిద్రకు ఉపక్రమించే ముందు పాలు తాగడం మేలు. పడుకోబోయే ముందు పాలల్లో కొంచెం పసుపు వేసుకుని తాగితే ప్రశాంతంగా నిద్ర పడుతుంది.