
Ratan Tata Will: మనసున్న మారాజు.. దేశంతో పాటు ప్రపంచం మెచ్చిన వ్యాపారవేత్త రతన్ టాటా. గత ఏడాది అక్టోబర్ 9న ఆయన 86 ఏళ్ల వయస్సులో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం తర్వాత అందరి దృష్టి ఆయన ఆస్తులు ఎవరికి వెళతాయనే అంశంపై ఉంది. ఎందుకంటే వివాహం చేసుకోని టాటాకు ఎలాంటి సంతానం లేదా వారసులు లేకపోవటమే. అయితే మరణానికి ముందే ఫిబ్రవరి 23, 2022లోనే టాటా తన ఆస్తుల పంపకానికి సంబంధించి ఒక వీలునామాను రూపొందించారు.
దివంగత రతన్ టాటా మెుత్తం ఆస్తుల విలువ రూ.3వేల 800 కోట్లుగా అంచనా వేయబడింది. రతన్ టాటా ఆస్తుల్లో ఎక్కువ భాగం టాటా సన్స్ ఆర్డినరీ అండ్ ప్రిఫరెన్స్ షేర్లతో పాటు మరికొన్ని ఆర్థిక ఆస్తులు ఆయనకు ఉన్నాయి. టాటా మరణానికి ముందే తన సంపదలో అధిక భాగాన్ని స్నేహితులు, సన్నిహితులు, కుటుంబానికి చెందేలా వీలునామాలో ఏర్పాట్లు చేయటం గమనార్హం.
- రతన్ టాటాకు కుక్కలంటే ఇష్టమని తెలిసిందే. అందుకే వాటి పోషణకు రూ.12 లక్షలను కేటాయించారు. వాటి పోషణకోసం ప్రతి మూడు నెలలకు రూ.30వేలు అందేలా వీలునామాలో స్థానం కల్పించారు.
- అలాగే రతన్ టాటాకు అత్యంత సన్నిహితుడిగా మెలిగిన టాటా ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ శంతను నాయుడికి అందించిన ఎడ్యుకేషన్ లోన్ మాఫీ చేయనున్నారు. అలాగే పొరుగున ఉన్న జేక్ మాలైట్ కూడా వడ్డీ లేని ఎడ్యుకేషన్ లోన్ ద్వారా ప్రయోజనం పొందుతారని వీలునామాలో చెప్పబడింది.
ALSO READ | Gold Rate: శుభవార్త.. రూ.55 వేలకు దిగిరానున్న గోల్డ్, ఇది మిల్స్ మాట..
- అలాగే జిమ్మీ టాటాకు జుహూ ప్రాపర్టీలో సగం వాటా దక్కుతుందని వీలునామా వెల్లడించింది. అలాగే జిమ్మీ టాటాకు వెండి ఆభణాలతో పాటు జ్యువెలరీలో కొంత భాగం చెందుతుందని కూడా పేర్కొనబడింది. ఇక జుహూ ప్రాపర్టీలో మిగిలిన వాటా నోయల్ టాటా, సిమోనీ టాటాలకు చెందుతుందని పేర్కొన్నారు.
- టాటాకు సన్నిహిత మిత్రుడు మెహిల్ మిస్త్రీ టాటాలకు చెందిన అలీభాగ్ బంగ్లా చెందుతుందని రతన్ టాటా పేర్కొన్నారు.
- సీషెల్స్‌లో టాటాకు ఉన్న భూములను RNT అసోసియేట్స్ సింగపూర్‌కు బదిలీ చేయనున్నారు.
- టాటాకు చెందిన ఇతర ఆర్థిక ఆస్తులలో మూడవ వంతు, బ్యాంకు స్థిర డిపాజిట్లు, ఆర్థిక సాధనాలు, ఆర్ట్, గడియారాలు వంటి భౌతిక ఆస్తులు రూ. 800 కోట్లుగా అంచనా వేయబడ్డాయి. వీటిని ఆయన సవతి సోదరీమణులు షిరీన్ జెజీభాయ్, డీనా జెజీభాయ్, టాటాకు సన్నిహితంగా ఉన్న టాటా గ్రూప్ మాజీ ఉద్యోగి మోహిని ఎం.దత్తా మధ్య విభజించనున్నారు.