
Gold Monetisation Scheme: నేటి నుంచి గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ నిలిపివేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటన చేసింది. మధ్య కాలం నుంచి దీర్ఘకాలిక డిపాజిట్లను స్కీమ్ కింద తొలగిస్తున్నట్లు స్పష్టం చేసింది. వాస్తవానికి స్కీమ్ పనితీరు, మారిపోతున్న మార్కెట్లను దృష్టిలో ఉంచుకని ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తన అధికారిక ప్రకటనలో వెల్లడించటం గమనార్హం. అయితే మలో చాలా మందికి భౌతికంగా పసిడి నిల్వలు, కొనుగోళ్ల గురించి తెలుసుకానీ ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ గురించి అవగాహన తక్కువ.
గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అంటే ఏంటి..?
వాస్తవానికి 2015 నంబర్ సమయంలో దేశంలో గోల్డ్ మానిటైజేషన్ పథకాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తిరిగి ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అదే సమయంలో రిటైల్ పెట్టుబడిదారులు డిజిటల్ గోల్డ్ పెట్టుబడుల్లో తమ డబ్బును ఇన్వెస్ట్ చేయటానికి సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సావరిన్ గోల్డ్ బాండ్స్ డిజిటల్ రూపంలో పేపర్ గోల్డ్ పెట్టుబడులు చేయటాన్ని ప్రోత్సహించింది. తద్వారా ఇన్వెస్టర్లకు నేరుగా బంగారం కొనటాన్ని తగ్గించింది. ఇది పరోక్షంగా పసిడి దిగుమతులపై ప్రభావాన్ని కూడా చూపించిన సంగతి తెలిసిందే.
గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అనేది ప్రజలకు తమ వద్ద ఖాళీగా ఉన్న బంగారు బిస్కెట్లు, గోల్డ్ కడ్డీలు, ఆభరణాలను బ్యాంకుల వద్ద నిల్వ చేయటం లేదా వాటికి అమ్మేందుకు ఉద్ధేశించబడింది. ఇది బ్యాంకుల ద్వారా తిరిగి ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురాబడి విదేశాల నుంచి భారీగా దిగుమతి చేసుకుంటున్న గోల్డ్ అవసరాలను తగ్గిస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ అప్పట్లో భావించింది. దీనికింద ప్రజలు డిపాజిట్ చేసిన పసిడిని ముందుగా కరిగించి బంగారు బిస్కెట్లుగా మార్చేవారు. ఈ క్రమంలో ఏవైనా ఇతర లోహాలు ఉంటే వాటిని తొలగించేవారు.
Also Read:-భగభగమంటున్న గోల్డ్-సిల్వర్ రేట్లు.. రూ.1100 పెరిగిన తులం
అలాగే ఆభరణాల్లో ఉండే రంగురాళ్లు, వజ్రాలను తిరిగి అందించి కేవలం బంగారం విలువను మాత్రమే స్కీమ్ కింద డిపాజిట్ చేసిన వ్యక్తులకు బ్యాంకులు చెల్లించేవి. తర్వాత తిరిగి డబ్బు చెల్లించాక వినియోగదారులు గతంలో బంగారు కడ్డీలు లేదా బిస్కెట్లుగా మార్చబడిన వారి బంగారం వెనక్కి పొందేవారు. అయితే ఇందులో ఉన్న అనేక ఇబ్బందుల కారణంగా ప్రజలు ఎక్కువగా దీనిలో పాల్గొనేందుకు ఇష్టపకడపోవటమే ప్రస్తుతం ఈ పథకాన్ని కేంద్రం తొలగించటానికి కారణంగా మారిందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే స్వల్ప కాలానికి మాత్రం ఇది ఇప్పటికీ కొనసాగించబడుతోంది.
గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ విఫలానికి దారితీసిన కొన్ని కీలక కారణాలను పరిశీలిస్తే..
- భారతీయులకు బంగారంతో తరతరాలుగా ఉన్న అమోషనల్ అటాచ్మెంట్, సెంటిమెంట్లు
- కరిగించటం నుంచి దానిని పరీక్షించవరకు ఉన్న పెద్ద ప్రాసెస్
- పన్నుతో పాటు పన్ను చెల్లింపులో వాటి నుంచి వచ్చే వడ్డీ ఆదాయాలను చూపించాల్సి రావటం
- చాలా మంది ప్రజలకు ఈ స్కీమ్ పరిచయం కాకపోవటం లేదా ప్రజలకు స్కీమ్ గురించి తక్కువగా అవగాహన ఉండటం