హైదరాబాద్, వెలుగు: విద్యారంగంలో సంచ లన విజయాలు సాధించి తమ సంస్థ నాలెడ్జ్ హబ్ గామారిందని శ్రీ చైతన్య విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ సుష్మ తెలిపారు. ఎంతో మంది విద్యార్థులను ఇంజినీర్లుగా, డాక్టర్లుగా తీర్చిదిద్దిన ఘనత శ్రీ చైతన్యకు దక్కుతుందని చెప్పారు.
నాలెడ్జ్ హబ్ లో ఐఐటీ– జేఈఈ, ఎన్ఈఈటీ, ఒలింపియాడ్స్, జాతీయ, అంతర్జాతీయ పోటీపరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయడంపై దృష్టి సారించామని పేర్కొన్నారు. ఏడో తరగతి నుంచి పదో తరగతి వరకు ఫౌండేషన్ కోర్సులు అందిస్తున్నామని వెల్లడించారు. స్కూల్ ఎడ్యుకేషన్ లో ప్రణాళిక ప్రకారం ప్రోగ్రామ్ లను చేర్చడం ద్వారా ప్రతి స్టూడెంట్ అత్యుత్తమ ర్యాంకు సాధించేలా కృషి చేస్తున్నామని వివరించారు. ప్రతి విద్యార్థి విలువైన సమయాన్ని వృథా కానీయకుండా పటిష్టమైన కార్యాచరణ రూపొందించామన్నారు.