
బీఎస్సీ అలాయిడ్ హెల్త్ సైన్సెస్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు మాప్ అప్ విడత వెబ్ కౌన్సిలింగ్ కు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఇవాళ ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 22వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 24వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు అర్హులైన అభ్యర్థులు కళాశాలల వారీగా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. కళాశాల వారిగా మిగిలిపోయిన సీట్ల వివరాలను వెబ్సైట్ లో చూసుకోవచ్చు. మరింత సమాచారానికి www.knruhs.telangana.gov.in వెబ్ సైట్లో సంప్రదించాలని యూనివర్సిటీ వర్గాలు వెల్లడించాయి.