కోదాడ, వెలుగు : కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ అభివృద్ధికి నూతన పాలకవర్గ సభ్యులు కృషి చేయాలని కోదాడ నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎర్నేని బాబు సూచించారు. ఆదివారం పట్టణంలో నూతనంగా నియమితులైన చైర్ పర్సన్ ఏపూరి తిరుపతమ్మ సుధీర్, వైస్ చైర్మన్ షేక్ బషీర్ ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ గతంలో కోదాడ మార్కెట్ కు ఉమ్మడి రాష్ట్రంలోనే మంచి పేరు ఉండేదని, కానీ ఇప్పుడు మార్కెట్ పేరు మసక బారిందన్నారు.
నూతన పాలకవర్గ సభ్యులు మార్కెట్ కు మళ్లీ పూర్వ వైభవం తేవాలని కోరారు. అనంతరం చైర్పర్సన్, వైస్ చైర్మన్మాట్లాడుతూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి సహకారం తో మార్కెట్ కమిటీ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ జబ్బార్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు వరప్రసాద్ రెడ్డి, శ్రీనివాస్, వెంకటేశ్, సుధీర్, శ్రీనివాస్, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.