
కోదాడ, వెలుగు : తెలంగాణ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ –2025 పోటీల్లో కోదాడ ఖ్యాతి స్పోర్ట్స్ అకాడమీ క్రీడాకారులు సత్తా చాటారు. శుక్ర, శనివారాల్లో హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో కోదాడ ఖ్యాతి స్పోర్ట్స్ అకాడమీ నుంచి శిక్షణ పొందిన 14 మంది క్రీడాకారులు పాల్గొని రెండో స్థానంలో నిలిచారు. వీరిలో సాధిక్, పవిత్ర, సౌజన్య రాష్ట్రస్థాయిలో మూడో స్థానంలో నుంచి కాంస్య పతకం అందుకున్నారు.
లక్ష్మీప్రసన్న, విజయ, మహేశ్వరి, వర్షిత, ఖాతిజాబేగంకు గోల్డ్ మెడల్స్ రాగా.. ఊహ, గౌరీ, అనూష సిల్వర్మెడల్స్సాధించారు. తెలంగాణ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ రమేశ్‌గౌడ్ చేతుల మీదుగా మెడల్స్ అందుకున్నారు. ఈ సందర్భంగా కోచ్ పాలడుగు ఖ్యాతి మాట్లాడుతూ తన అకాడమీ నుంచి క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో ప్రతిభ సత్తాచాటడం సంతోషంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్సాధించేందుకు కృషి చేస్తామన్నారు.