మిరప కూలీలతో వెళ్తున్న ఓ ఆటో బోల్తా కొట్టింది. ఈ ప్రమాదం ఆంధ్రప్రదేశ్, ఎన్టీఆర్ జిల్లా జయ్యపేట మండలం చిల్లకల్లు పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం నడిగూడెం మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన మిరప కూలీలు.. ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం మక్కపేట గ్రామానికి మిరపతోట పని చేసేందుకు ఆటోలో వెళ్తుండగా.. మార్గ మధ్యలో ప్రమాదవశాత్తు ఆటో పల్టీ కొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న పలువురు కూలీలు గాయపడ్డారు. ఈ ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం 15 మంది కూలీలు ఉన్నారు.
సమాచారం అందుకున్న టిడిపి పార్టీ మాజీ ఎమ్మెల్యే తమ్ముడు శ్రీరామ్ చిన్న బాబు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారిని తన కారులో జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.