- కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతిరెడ్డి
సూర్యాపేట, వెలుగు : మహిళా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. గురువారం మోతె మండలం రైతు వేదిక ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తో కలిసి కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. 14 గ్రామాలకు చెందిన 66 మంది లబ్ధిదారులకు రూ.6,607,656 చెక్కులు అందచేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో సూర్యనారాయణ, తహసీల్దార్ సంఘ మిత్ర, లబ్ధిదారులు పాల్గొన్నారు.