
హుజూర్ నగర్, వెలుగు : అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి అన్నారు. శనివారం హుజూర్‌నగర్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులను స్పీడప్ చేసేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు.
పార్టీకి కార్యకర్తలే బలమని, ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. సమావేశంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జునరావు, ఉపాధ్యక్షుడు ఉపేందర్ యాదవ్, నాయకులు కోలపుడి యోహాన్, ఎడవెల్లి వీరబాబు, ఆదేర్ల శ్రీనివాస్ రెడ్డి, గంజి శివ తదితరులు పాల్గొన్నారు.
చిట్టెమ్మ మృతి పార్టీకి తీరనిలోటు..
నడిగూడెం (మునగాల), వెలుగు : నడిగూడెం మండల కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ఏపూరి తిరుపతమ్మ –సుధీర్ అత్త ఏపూరి చిట్టెమ్మ శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందింది. విషయం తెలుసుకున్న కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి నడిగూడెం వెళ్లి మృతదేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చిట్టెమ్మటి పార్టీకి తీరనిలోటు అని అన్నారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం మునగాలలో 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1.56 కోట్లతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాన్ని ఆమె ప్రారంభించారు.