క్యాన్సర్​ను ముందస్తుగా గుర్తిస్తే నయం చేయొచ్చు : ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి

క్యాన్సర్​ను ముందస్తుగా గుర్తిస్తే నయం చేయొచ్చు : ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి

కోదాడ, వెలుగు : క్యాన్సర్ ను ముందస్తుగా గుర్తిస్తే వ్యాధిని నయం చేయవచ్చని కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి అన్నారు. శుక్రవారం కోదాడ ప్రభుత్వ ఆస్పత్రిలో జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షా కేంద్రాన్ని డీఎంహెచ్ వో కోట చలంతో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధి నిర్మూలనకు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి వారు అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. నిరుపేదలకు అత్యాధునిక సౌకర్యాలతో కోదాడలో మొబైల్ వాహనం ద్వారా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయడం సంతోషంగా ఉందన్నారు. 

క్యాన్సర్ వ్యాధిని తొలి దశలో గుర్తిస్తే నయం చేయవచ్చని తెలిపారు. అనంతరం 300 మందికి క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేసినట్లు డీఎంహెచ్​వో తెలిపారు. కార్యక్రమంలో పీసీసీ డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ సామినేని ప్రమీల, డీసీహెచ్ఎస్ వెంకటేశ్వర్లు, ఆస్పత్రి సూపరింటెండెంట్​దశరథ, డిప్యూటీ డీఎంహెచ్ వో జయమనోహరి, బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి జనరల్ మేనేజర్ ఆదిత్య, డాక్టర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.