రైతులను ఇబ్బంది పెడుతున్న రెవిన్యూ అధికారి​ సస్పెన్షన్​

రైతులను ఇబ్బంది పెడుతున్న రెవిన్యూ అధికారులను సూర్యాపేట జిల్లా కలెక్టర్​ సస్పెండ్​ చేశారు.   కోదాడ తహశీల్దార్  సాయిరాం,  రెవెన్యూ ఇన్స్పెక్టర్ పి. సుజిత్ పై రైతులు కలెక్టర్​ కు   పిర్యాదు  చేశారు. తహశీల్దార్​పై వచ్చిన అభియోగాలను విచారించి పూర్తి నివేదిక ఇవ్వాల్సిందిగా  కోదాడ ఆర్డీవోను కలెక్టర్​ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు.  రైతులను ఇబ్బందిపెడుతున్న  విషయం వాస్తవమేనని.. కోదాడ తహశీల్దార్​.. రెవిన్యూ ఇన్స్​పెక్టర్​ సుజిత్​ అక్రమాలకు పాల్పడుతున్నారని తన విచారణలో వెల్లడైందని ఆర్డీవో నివేదిక ఇచ్చినట్లు సమాచారం అందుతోంది.   దీంతో కోదాడ తహశీల్దార్ సాయి రాం ను బదిలీ చేయగా ...రెవెన్యూ ఇన్స్పెక్టర్ సుజిత్ ను సస్పెండ్ చేశారు. అలాగే   సూర్యాపేట కలెక్టరేట్ కార్యాలయంలో డిప్యుటేషన్ పై పని చేస్తున్న నాగారం తహశీల్దార్ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ షఫీ పై పిర్యాదులు  రావడంతో ఆయనను కూడా సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది.