
ఏపీలో ఎన్డీయే కూటమి భారీ మెజారిటీ దిశగా దూసుకుపోతోంది. అనూహ్య రీతిలో మంత్రులంతా వెనుకంజలో ఉన్నారు. జగన్ మినహా క్యాబినెట్ అంతా ఓటమి దిశగా సాగుతోంది.ఈ క్రమంలో గుడివాడ అభ్యర్థి కొడాలి నాని, గన్నవరం అభ్యర్థి వల్లభనేని వంశీలు కౌంటింగ్ సెంటర్ నుండి వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. కూటమి 140స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న నేపథ్యంలో కూటమి శ్రేణులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు.