సీఎం జగన్ పై దాడి తర్వాత పునః ప్రారంభమైన మేమంతా సిద్ధం బస్సు యాత్ర గుడివాడ చేరుకుంది. గుడివాడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబుపై ఘాటైన వ్యాఖ్యలు చేసారు ఎమ్మెల్యే కొడాలి నాని. చంద్రబాబుకు ఇవే ఆఖరి ఎన్నికలని, జగన్ ను ఓడించటం చంద్రబాబు తరం కాదని అన్నారు. జగన్ రాజకీయంగా ఎదుర్కునే దమ్ము లేకనే భౌతిక దాడికి ప్లాన్ చేశాడని చంద్రబాబుపై మండి పడ్డారు. జగన్ ను ఎదుర్కోలేక ఒక పక్క దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ మరో పక్క వదినమ్మ పురందేశ్వరిని పెట్టుకున్నారని అన్నారు.
జగన్ సభలకు వస్తున్న స్పందన చూసి ఓర్వలేక చంద్రబాబు వెనుక నుంచి వెన్నుపోటు పొడిచేందుకు సిద్ధమయ్యాడని అన్నారు. జగన్ మీద దేవుడి దయ, ప్రజల ఆశీస్సులు ఉన్నందునే దాడి చేసినా కూడా ఏమీ కాలేదని అన్నారు. తండ్రి స్థానంలో ఉండి రాష్ట్రంలోని పిల్లలకు జగన్ నాణ్యమైన విద్య, భోజనం అందిస్తున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో సంక్షేమ పథకాలే జగన్ ను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు కొడాలి నాని