
చంద్రబాబు అరెస్ట్ పై మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని స్పందించారు. ఇన్నాళ్లూ వ్యవస్థలను మేనేజ్ చేస్తూ వచ్చిన చంద్రబాబు పాపం పండింది అంటూ ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. తన పోస్ట్ కింద కరప్షన్ కింగ్ సీబీఎన్, స్కామ్ స్టేర్ చంద్రబాబు అనే హ్యాష్ ట్యాగ్స్ ను కూడా జత చేశారు. చంద్రబాబు చేసిన పాపాలకు అతిత్వరలోనే శిక్ష పడుతుందంటూ ఇప్పటికే పలుమార్లు కొడాలి నాని మాట్లాడారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, చట్టానికి ఎవరూ చుట్టాలు కాదన్నారు. చేసిన పాపాలకు చంద్రబాబు శిక్ష అనుభవించాల్సిందేనని చెప్పారు.
ఇన్నాళ్లూ వ్యవస్థలను మేనేజ్ చేస్తూ వచ్చిన చంద్రబాబు పాపం పండింది. #CorruptionKingCBN #ScamsterChandrababu https://t.co/Fv72Cyod5E
— Kodali Nani (@IamKodaliNani) September 9, 2023
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ అయ్యారు. నంద్యాలలో సీఐడీ పోలీసులు ఆయనను 2023 సెప్టెంబర్ 09న అదుపులోకి తీసుకున్నారు. స్కిల్ కేసులో చంద్రబాబు ఏ1గా ఉన్నారంటూ .. చంద్రబాబును అరెస్ట్ చేసేందుకు అర్థరాత్రి నుంచి ప్రయత్నించగా టీడీపీ నేతలు అడ్డుకున్నారు. టీడీపీ నేతలను అరెస్ట్ చేసిన అనంతరం చంద్రబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చంద్రబాబుపై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, రీడ్‌విత్ 34 and 37 ఐపీసీ సెక్షన్ ల కింద కేసులు నమోదు చేశారు.