
మెగాస్టార్ చిరంజీవికి తనకు మధ్య అగాధాలు సృష్టించడానికి టీడీపీ, జనసేన నేతలు ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఆరోపించారు.
ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు పురస్కరించుకొని గుడివాడలో కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేశారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తాను ఏం మాట్లాడినా ఏపీలోని ప్రతిపక్షాలకు బూతులాగే వినిపిస్తుందని ఎద్దేవా చేశారు.
చిరు విషయంలో తాను, తమ కార్యకర్తలు స్పష్టంగానే ఉన్నామని, ఆయన్ని విమర్శిస్తే ఏమవుతుందో బాగా తెలుసని పేర్కొన్నారు. చిరంజీవిపై కొడాలి నాని గతంలో చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు.
ALSO READ : బరువు తగ్గాలన్నా.. బుర్ర పని చేయాలన్నా.. ఖర్జూరం తినాల్సిందేనట
తాను చిరంజీవిని విమర్శించినట్లు నిరూపించాలని టీడీపీ, జనసేనలకు సవాల్ విసిరారు. తన వెంట 60 శాతం మంది ఆయన అభిమానులే ఉంటారని.. ఎవరి జోలికి వెళ్లని మెగాస్టార్గురించి విమర్శించేంత సంస్కారహీనుడిని కానని పేర్కొన్నారు.
ఇప్పటికే ఎన్నో సార్లు ఆయన్ని కలిశానని, పెద్దాయనగా చిరంజీవి చెప్పే సూచనలు పాటిస్తానని తెలిపారు. ఇండస్ట్రీలో డ్యాన్సులు, నటన చేతకాని పకోడీ గాళ్లకు చిరంజీవి సలహాలు ఇవ్వాలనే తాను చెప్పానని, చిత్ర పరిశ్రమలో అగ్రభాగాన ఉన్న చిరంజీవికి డాన్సులు, యాక్షన్ రాదా? ...ఈ వ్యాఖ్యలు చిరంజీవి గురించి మాట్లాడినట్లు ఎలా అవుతుందని కొడాలి నాని ప్రశ్నించారు.