ఏపీ ప్రభుత్వం సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పు తెచ్చిందంటూ అటు ఎలక్ట్రానిక్ మీడియాలో, ఇటు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి ప్రతిపక్షాలు. ఈ అంశంపై మాజీ మంత్రి కొడాలి నాని ఘాటుగా స్పందించారు. సచివాలయం కేవలం పదెకరాల ప్రభుత్వ ఆస్థి మాత్రమే అని, సచివాలయం తాకట్టు పెట్టొద్దని రాజ్యాంగంలో ఏమైనా రాసి ఉందా అని ప్రశ్నించాడు. ఆస్తులు తాకట్టు పెట్టకుండా ఏ బ్యాంకు కూడా లోన్లు ఇవ్వవని అన్నాడు.
ప్రజల అవసరాల కోసం డబ్బులు అవసరమైనప్పుడు ప్రభుత్వాలు ఆస్తులు తాకట్టు పెట్టడం మామూలే అని, డబ్బులు ఉన్నప్పుడు తిరిగి చెల్లించి ఆస్తులు విడిపిస్తారని అన్నాడు. ఈ విషయంలో చంద్రబాబు చిల్లర రాజకీయం చేస్తున్నాడని, ఫలానా ఆస్తులు మాత్రమే తాకట్టు పెట్టాలని రాజ్యాంగంలో ఏమైనా రాసుందా అని ప్రశ్నించాడు. ఈ రాష్ట్రానికి ఉన్న 4లక్షల కోట్ల అప్పులో చంద్రబాబు చేసిందే 2.5 లక్షల కోట్లు ఉందని, జగన్ చేసింది 2లక్షల కోట్ల రూపాయలే అని అన్నాడు.
సచివాలయం కేవలం పదెకరాల పొలం మాత్రమే అని, ఎకరాకు 2కోట్లు అనుకున్నా కూడా దాని విలువ 20కోట్లు మాత్రమే అని అన్నారు. తాకట్టు పెట్టద్దు అనడానికి అదేమీ చంద్రబాబు ఆస్తి కాదని, ప్రభుత్వ ఆస్తి అని అన్నది. ప్రభుత్వానికి ఉన్న వెసులుబాటును బట్టి దేన్నైనా తాకట్టు పెట్టుకోవచ్చని, చంద్రబాబు పెట్టినవి మాత్రమే తాకట్టు పెట్టాలని అంబెడ్కర్ రాసిన రాజ్యాంగంలో రాసి ఉందా అని ప్రశ్నించారు. కాగా, 370కోట్ల కోసం ప్రభుత్వం సచివాలయాన్ని తాకట్టు పెట్టిందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని, ఇలాంటి వార్తలు రాస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు అన్నారు.