ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై మాజీ మంత్రి, వైసీపీ ఫైర్ బ్రాండ్ కొడాలి నాని స్పందించారు. ఇవాళ (సెప్టెంబర్ 25) ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తప్పుడు ప్రచారంతో చంద్రబాబు శ్రీవారి ప్రతిష్ఠను మంటగలుపుతున్నారని.. రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే దేవుడు కూడా క్షమించడని హెచ్చరించారు. గతంలో మాదిరిగానే మా ప్రభుత్వం హయాంలోనూ టెండర్లు పిలిచామని.. కొత్త విధానం ఏమి తీసుకురాలేదని స్పష్టం చేశారు.
ALSO READ | తిరుమల లడ్డూ వివాదం: అన్ని ఆలయాల్లో పూజలకు జగన్ పిలుపు
గతంలో చంద్రబాబు హయాంలో 15 సార్లు నెయ్యిలో క్వాలిటీ లేదని ట్యాంకర్లు వెనక్కి పంపిస్తే.. మా వైసీపీ హయాంలో నెయ్యి క్వాలిటీ లేదని 18 సార్లు ట్యాంకర్లను వెనక్కి పంపిచామని గుర్తు చేశారు. ఎవరూ సీఎంగా ఉన్న నెయ్యిలో క్వాలిటీ లేకుంటే రిటర్న్ పంపిస్తారన్నారు. ఈ ఏడాది జులై 17న ఒక ట్యాంకర్‌లో నెయ్యి క్వాలిటీ లేదని వెనక్కి పంపారని.. ఆ నెయ్యిని లడ్డూ తయారీలో వాడలేదని పేర్కొన్నారు.
ALSO READ | తిరుపతి లడ్డూ కల్తీ ఇష్యూలో తొలి కేసు నమోదు
రాజకీయ లబ్ది కోసమే జంతువుల కొవ్వుతో లడ్డూ తయారు చేశారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల లడ్డూ కల్తీ ఘటనపై దమ్ముంటే సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. సిట్ అంటే సిట్ (కూర్చునే) అయ్యే సిట్‌తో కాదని ఎద్దేవా చేశారు. కాగా, తిరుమల లడ్డూ కల్తీ ఘటనపై విచారణ కోసం చంద్రబాబు ప్రభుత్వం డీఐజీ సర్వశ్రేష్ఠి త్రిపాఠి నేతృత్వంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.