ప్రభుత్వ భవనాల్లో ఉండాల్సిన ఖర్మ  జగన్ కు లేదు: మాజీ మంత్రి కొడాలి నాని

తాడేపల్లిలో వైసీపీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు పాల్గొన్నారని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. రుషికొండ లో ఉన్న భవనాలను గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రుషికొండలో ఉన్న భవనాలు జగన్ నివాసాలు అని చెబుతున్నారని ప్రభుత్వ భవనాల్లో ఉండాల్సిన కర్మ జగన్ కు లేదని.. వైజాగ్ లో సొంత ఇల్లు కట్టుకొని షిఫ్ట్ అవుతరని.. కొడాలి నాని పేర్కొన్నారు.

 ఓటమి కేవలం ఇంటర్వెల్ మాత్రమేనని ...తమ నేతలకు పార్టీ చీఫ్ వైఎస్ జగన్ ధైర్యం చెప్పారని తెలిపారు... శకుని పాచికల మాదిరిగా ఎన్నికల ఫలితాలు వచ్చాయి కానీ ఆధారాలు లేకుండా మాట్లాడలేం.శ్రీకృష్ణుడి తోడు ఉన్న పాండవులు అప్పుడప్పుడు ఓడిపోయారు.చివరకు ప్రతి ఒక్కరూ అర్జునుడుల విజయం సాధిస్తారు.99% హామీలు అమలుతో మనం తలెత్తుకునేలా పాలించాం అని పేర్కొన్నారు.

ఏపీ ప్రభుత్వం తమను టార్గెట్ చేసుకున్నా భయపడేది లేదని కొడాలి నాని అన్నారు. హామీలను అమలుచేయకుండా ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వానికి ఆరు నెలల సమయం ఇద్దామని జగన్ చెప్పాడని కొడాలి నాని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలు పక్కదారి పట్టించడానికి పోలవరం, అమరావతి అంటూ చంద్రబాబు తిరుగుతున్నాడని కొడాలి నాని ఆరోపణలు గుప్పించారు. 


వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ త్వరలోనే  ఓదార్పు యాత్ర చేస్తారని కొడాలి నాని పేర్కొన్నారు. టీడీపీ శ్రేణులు దాడులు చేసిన వారిని జగన్ పరామర్శిస్తారని వెల్లడించారు.నియోజకవర్గాల్లో వారం రోజులపాటు నేతలపర్యటనలు ఉంటాయన్నారు. ఓటమి ఒకమిరాకిల్ మాదిరి ఉందని, ఇంత మంచి చేసినాఓటమి చెందడం నమ్మశక్యంగా లేదని చెప్పారు.సూపర్ సిక్స్ ఎప్పటి నుంచి అమలు చేస్తారోచంద్రబాబు చెప్పాలని కొడాలి నాని డిమాండ్​ చేశారు.