కేసీఆర్ నిరంకుశ పాలన అంతం చేయడానికి కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తామని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. రేవంత్ రెడ్డితో భేటీ అనంతరం మాట్లాడిన కోదండరాం.. ప్రజపరిపాలన కోసం తాము కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్నామని చెప్పారు. తెలంగాణలో స్వేచ్ఛ, స్వాతంత్య్రం కోసం కాంగ్రెస్ తో కలిసి పని చేయాలని భావిస్తున్నామని తెలిపారు. తమ నిర్ణయాన్ని ప్రజలు అర్థం చేసుకుని సహకరించాలన్నారు. తమ నిర్ణయానికి తెలంగాణ ప్రజలు మద్దతు తెలిపాలని కోరారు. ఉమ్మడి కార్యక్రమాన్నిరూపొందించామని.. ప్రజాస్వామిక పాలన కోసం కలిసి పనిచేస్తామన్నారు. ఉమ్మడి కార్యక్రమం సాధించే లక్ష్యంగా ముందుకెళ్తామన్నారు. ఈ సారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి టీజేఎస్ దూరంగా ఉండనుంది.
తెలంగాణకు పట్టిన చీడ, పీడ వదలాలంటే కోదండరాం మద్దతు అవసరమని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ జన సమితి, కాంగ్రెస్ కలిసి పనిచేస్తాయని చెప్పారు. కాంగ్రెస్‌తో కలిసి పని చేయడానికి కోదండరామ్ సుముఖత చూపారని తెలిపారు. కోదండరామ్ మద్దతు కోరామన్నారు. ఎన్నికల్లో తెలంగాణ జన సమితి పోటీకి దూరంగా ఉంటుందని రేవంత్ రెడ్డి వివరించారు.