- వ్యవసాయమే ప్రభుత్వానికి తొలి ప్రాధాన్యమని వెల్లడి
హైదరాబాద్, వెలుగు : వ్యవసాయం, రైతు కమిషన్ చైర్మన్ గా కోదండరెడ్డి బుధవారం బీఆర్కే భవన్ లో బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలో రుణమాఫీ అమలు చేయటం గొప్ప నిర్ణయమని న్నారు. ప్రభుత్వానికి నిధుల కొరత, అప్పులు, వడ్డీల చెల్లింపు సమస్య ఉన్నప్పటికీ రైతులకు ఇచ్చిన హామీ మేరకు సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ అమలు చేశారని ప్రశంసించారు. వ్యవసాయం, రైతు సంక్షేమం అనే రెండు అంశాలే ప్రభుత్వానికి తొలి ప్రాధాన్యమని కోదండరెడ్డి తెలిపారు.
గిట్టుబాటు ధర సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. రుణమాఫీతో పాటు సన్నవడ్లకు రూ.500 బోనస్, రైతు భరోసాకు ఎకరానికి రూ. 7500 ఇవన్ని రైతులను రాజులుగా చేసే నిర్ణయాలన్నారు. వ్యవసాయం, రైతుల సమస్యలపై శాస్ర్తవేత్తలు, నిపుణులు, రైతు సంఘాల నేతలు, ఎన్జీవోల సలహాలు, సూచనలు తీసుకొని ప్రభుత్వానికి అందచేస్తానని కోదండరెడ్డి పేర్కొన్నారు.