రాహుల్ మా మద్దతు కోరారు: కోదండరాం

రాహుల్ మా మద్దతు కోరారు: కోదండరాం

కాంగ్రెస్ తో పొత్తులు, సీట్ల సర్దుబాటుపై చర్చ జరగలేదన్నారు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం. కరీంనగర్ లో  రాహుల్ గాంధీతో భేటీ అయిన  అనంతరం మీడియాతో మాట్లాడారు కోదండరాం.  ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని రాహుల్  కోరినట్లు చెప్పారు.  తెలంగాణలో నిరంకుశ పాలన పోవాలనే అభిప్రాయాన్ని రాహుల్ వ్యక్తం చేసినట్లు కోదండరాం తెలిపారు. తెలంగాణలో నిరంకుశ పాలన పోవాలన్న తన అభిప్రాయంతో రాహుల్ ఏకీభవించినట్లు తెలిపారు.    తెలంగాణలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు,బీఆర్ఎస్ పాలనపై  చర్చించామన్నారు. మరోసారి రాహుల్  టీం తమతో చర్చలు జరపనున్నట్లు  తెలిపారు.

కాంగ్రెస్ బస్సు యాత్ర సందర్భంగా  ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు తెలంగాణకు వచ్చిన కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీని  కోదండరాం కలిశారు. కరీంనగర్ వీ పార్క్ హోటల్ లో కోదండరామ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాలని రాహుల్  కోరినట్లు చెప్పారు కోదండరాం. 

Also Read :- పుష్ప సినిమా మాదిరి గంజాయి సప్లయ్

కాంగ్రెస్ బలహీనంగా ఉన్న రెండు మూడు చోట్లలో సీట్లను కోదండరామ్ అడుగుతున్నట్లు తెలుస్తోంది.  కాంగ్రెస్ బలహీనం గా ఉన్న ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ముదోల్, ఎల్లారెడ్డి, కోరుట్ల, జహీరాబాద్ స్థానాలను జనసమితి  ఆశిస్తుంది.