భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు జీవో 22 ప్రకారం జీతాలివ్వాలని ప్రొఫెసర్ కోదండరాం ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ కార్మికుల పరిరక్షణ సంఘం లీడర్లు శుక్రవారం సింగరేణి సీఎండీ బలరామ్‌కు హైదరాబాద్‌లో కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఆ వివరాలను సంఘం అధ్యక్షుడు రాసూరి శంకర్ వెల్లడించారు. తమ సమస్యలు పరిష్కరించాలని గతంలో18 రోజులు సమ్మె చేయగా జీవో 22 ప్రకారం జీతాలిస్తామని సింగరేణి యాజమాన్యం ఒప్పుకుందన్నారు.
కానీ, అప్పటి సర్కారు నుంచి గ్రీన్‌సిగ్నల్ రాకపోవడంతో ఆగిపోయిందన్నారు. వెంటనే జీవోను అమలు చేసే విధంగా ప్రభుత్వానికి లెటర్ రాయాలని సింగరేణి సీఎండీని కోరామన్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. టీజేఎస్రాష్ట్ర లీడర్లు మల్లెల రామనాథం, యూనియన్ఉపాధ్యక్షుడు గూడెల్లి యాకయ్య, బాషా, రవి పాల్గొన్నారు.