
కొడంగల్, వెలుగు: కొడంగల్‌లోని శ్రీమహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం రథోత్సవం నిర్వహించారు. సీఎం రేవంత్‌రెడ్డి కూతురు నైమిషారెడ్డి, అల్లుడు సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు. అంతకు ముందు ఆలయంలోని స్వామివారిని దర్శించుని, ప్రత్యేక పూజలు చేశారు.
ఆలయ ధర్మకర్తలు నందారం కుటుంబ సభ్యులు వారికి స్వాగతం పలికారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించిన బండలాగుడు పోటీలు హోరాహోరీగా సాగాయి. మొత్తం 32 జతల ఎద్దులు పోటీపడ్డాయి. కొడంగల్ కు చెందిన దండ్ల భీములు ఎద్దులు మొదటి స్థానంలో నిలిచి 25 తులాల వెండిని సొంతం చేసుకున్నాయి.