
కొడంగల్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చొరవతో సర్కారు బడులకు మహర్ధశ మొదలైందని కాంగ్రెస్ కొడంగల్ ఇంచార్జీ తిరుపతిరెడ్డి అన్నారు. మంగళవారం కొడంగల్లో పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనులను పరిశీలించారు.
ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తయారు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించిందన్నారు. కడా స్పెషల్ ఆఫీసర్ వెంకట్రెడ్డి, ఎంఈఓ రాంరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు ప్రశాంత్ ఉన్నారు.