బైరి నరేష్‭కి బెయిల్.. చర్లపల్లి జైలు నుండి విడుదల

దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్‭కి బెయిల్ మంజూరైంది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ కొడంగల్ కోర్టు తీర్పునిచ్చింది. దాదాపు 45 రోజుల పాటు జైలులో ఉన్న నరేష్‭ను చర్లపల్లి జైలు నుండి పోలీసులు విడుదల చేశారు. బైరి నరేష్ అయ్యప్ప స్వామిపై.. శివకేశవులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై తెలుగు రాష్ట్రాల్లో అయ్యప్ప స్వామి భక్తులు, హిందూ సంఘాలు ఆందోళన చేపట్టాయి. పలు పోలీస్‌స్టేషన్లలో బైరి నరేష్ పై కేసులు నమోదయ్యాయి. కొడంగల్‌ పోలీసులు బైరి నరేష్‌తో పాటు.. అంబేద్కర్‌ జాతర కార్యక్రమ నిర్వాహకుడు డోలు హన్మంతును కూడా పోలీసులు అరెస్టు చేశారు.