పదేండ్ల బీఆర్ఎస్​ పాలనలో కొడంగల్ ​అభివృద్ధికి నోచుకోలేదు: నియోజకవర్గ ఇన్చార్జి తిరుపతిరెడ్డి

పదేండ్ల బీఆర్ఎస్​ పాలనలో కొడంగల్ ​అభివృద్ధికి నోచుకోలేదు: నియోజకవర్గ ఇన్చార్జి తిరుపతిరెడ్డి

కొడంగల్, వెలుగు: వెనకబడ్డ కొడంగల్​అభివృద్ధికి సీఎం రేవంత్​రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని నియోజకవర్గ ఇన్​చార్జి తిరుపతిరెడ్డి అన్నారు. కొడంగల్ మున్సిపాలిటీలో రూ. 7.72 కోట్ల అభివృద్ధి పనులకు సోమవారం ఆయన శ్రీకారం చుట్టారు. రూ. 6.8 కోట్లతో నిర్మించనున్న ఆర్అండ్​బీ గెస్ట్​హౌజ్​కు భూమి పూజ చేశారు. 

బోంరాస్​పేట మండలంలో రూ. 65 లక్షలతో లైబ్రరీ, రూ.27 లక్షలతో పాఠశాల అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పదేండ్ల బీఆర్ఎస్​ పాలనలో కొడంగల్​అభివృద్ధికి నోచుకోలేదన్నారు. అనంతరం పలువురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్​చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో వికారాబాద్​ జిల్లా లైబ్రరీ చైర్మన్​ రాజేశ్​ రెడ్డి, కడా స్పెషల్​ఆఫీసర్​ వెంకట్​రెడ్డి, కాంగ్రెస్​ మండల అధ్యక్షుడు ప్రశాంత్​, నర్సింహులు ఉన్నారు.