ఎంపీ రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే టికెట్లను అమ్మకోవడానికి తాపత్రయపడుతున్నారని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఆరోపించారు. కొడంగల్ అభివృద్ధిపై రేవంత్ రెడ్డికి, నరెందర్ రెడ్డి సవాల్ విసిరారు. అభివృద్ధిపై ఏ గ్రామానికైనా చర్చకు రావాలన్నారు. తొమ్మది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి కొడంగల్ కు రేవంత్ చేసిందేమీ లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఎక్కిడినుంచి పోటీ చేస్తాడో చెప్పాలని ఆయన డిమాండ్ చేశాడు. కొడంగల్ నియోజకవర్గానికి సీఎం కేసీఆర్ పెద్ద ఎత్తున నిధులిచ్చి అభివృద్ధి చేస్తున్నారని నరేందర్ రెడ్డి తెలిపారు.