
బచ్చన్నపేట, వెలుగు : మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కొడవటూరు సిద్దేశ్వరస్వామి బ్రహోత్మవాలు బుధవారం నుంచి నాలుగు రోజులపాటు జరుగనున్నాయి. 8న శివరాత్రిరోజు శివకల్యాణం సందర్భంగా జనగామ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్టు నిర్వహకులు తెలిపారు. సిద్దుల గుట్టకు రావడానికి జనగామ, బచ్చన్నపేట, హుస్నాబాద్, ఆలేరు, సిద్దిపేట, గజ్వేల్, యాదగిరిగుట్ట ప్రాంతాల నుంచి భక్తులకు బస్సు సౌకర్యం ఉంది. మండకేంద్రం బచ్చన్నపేటకు వచ్చి సిద్దుల గుట్టకు చేరుకోడానికి ఆటోల సౌకర్యం ఉందంటున్నారు.