దళితబంధు డబ్బులు విడుదల చేయాలి : కోగిల మహేశ్​

ములుగు, వెలుగు: రెండో విడత దళితబంధు డబ్బులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని దళితబంధు సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కోగిల మహేశ్​డిమాండ్ చేశారు. సోమవారం ములుగులో లబ్ధిదారులతో కలిసి ర్యాలీ నిర్వహించి, అనంతరం కలెక్టర్ దివాకరకు వినతిపత్రం అందజేశారు. 

ఈ సందర్భంగా మహేశ్​మాట్లాడుతూ రెండో విడత దళితబంధులో భాగంగా కలెక్టర్ ద్వారా ఎంపికైన రెండో విడత లబ్ధిదారుల కోసం కలెక్టర్​ అకౌంట్ లో జమ చేయబడిన రూ.26.49 కోట్లను వెంటనే విడుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో దళితబంధు సాధన సమితి రాష్ర్ట కోఆర్డినేటర్​ మడికొండ రమేశ్, సలహాదారు దర్శనాల సంజీవ, నాయకులు తదితరులు పాల్గొన్నారు.