Crickek World Cup 2023: చరిత్ర సృష్టించేందుకు సిద్ధం: ఆల్‌టైం రికార్డ్‌పై రోహిత్, కోహ్లీ గురి

Crickek World Cup 2023: చరిత్ర సృష్టించేందుకు సిద్ధం: ఆల్‌టైం రికార్డ్‌పై రోహిత్, కోహ్లీ గురి

పరిమిత ఓవర్ల క్రికెట్ లో దాదాపు దశాబ్దానికి పైగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తమదైన ముద్ర వేశారు. ఇండియాలోనే కాదు  ప్రపంచ క్రికెట్ పై వీరిద్దరూ తమ ఆధిపత్యం చూపించారు. ఇప్పటివరకు ఈ ద్వయం వన్డేల్లో ఏకంగా 78 సెంచరీలు బాదేశారు. పరుగుల విషయానికి వస్తే ఇద్దరూ కూడా 1000 క్లబ్ లో చేరిపోయారు. ఈ క్రమంలో ఈ ఇద్దరు స్టార్లు ఒక అరుదైన రికార్డ్ పై కన్నేశారు.
 
వరల్డ్ కప్ లో భాగంగా కాసేపట్లో ఇండియాతో బంగ్లాదేశ్ తలపడబోతుంది. పూణే వేదికగా జరగనున్న ఈ మ్యాచులో రోహిత్, కోహ్లిలను ఒక రికార్డ్ ఊరిస్తుంది. బంగ్లాదేశ్ పై రోహిత్ వన్డే ఐసీసీ టోర్నీల్లో వరుసగా మూడు సెంచరీలు చేసాడు. 2015 బంగ్లాపై జరిగిన క్వార్ట్రర్స్ ఫైనల్లో సెంచరీ చేసిన రోహిత్.. ఆ తర్వాత 2017 ఛాంపియన్స్ ట్రోఫీ, 2019 వరల్డ్ కప్ లీగ్ మ్యాచుల్లో సెంచరీలు చేసాడు. ఇప్పటివరకు ఒకే జట్టుపై ఐసీసీ ఈవెంట్లలో చెలరేగిన బ్యాటర్ లేడు. దీంతో రోహిత్ ఈ రోజు కూడా సెంచరీ చేస్తే ఒకే జట్టుపై ఐసీసీ ఈవెంట్లలో  నాలుగు సెంచరీలు చేసిన బ్యాటర్ గా చరిత్రలో నిలిచిపోతాడు.

Also Read :- కోహ్లీ నన్ను రెచ్చగొడతాడు

మరోవైపు విరాట్ కోహ్లీ 26000 పరుగుల మైలురాయికి దగ్గరలో ఉన్నాడు. నేడు జరిగే మ్యాచులో 77 పరుగులు చేస్తే అంతర్జాతీయ క్రికెట్ లో వేగంగా 26000 పరుగులు చేసిన బ్యాటర్ గా సరి కొత్త చరిత్ర సృష్టిస్తారు. ఫాస్టెస్ట్ 25000 పరుగుల రికార్డ్ కూడా కోహ్లీ పేరిట ఉంది. ఈ నేపథ్యంలో కింగ్ ఈ రికార్డుని బంగ్లాపై మ్యాచులో బ్రేక్ చేస్తాడో లేదో చూడాలి.