ఐపీఎల్లో కోహ్లీ అరుదైన రికార్డు..ఏకైక ఆర్సీబీ ప్లేయర్

ఐపీఎల్లో కోహ్లీ అరుదైన రికార్డు..ఏకైక ఆర్సీబీ ప్లేయర్

రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ మరో రికార్డు సృష్టించాడు. ఐపీఎల్లో అరుదైన రికార్డు తన పేరుమీద లిఖించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో వంద క్యాచులు పట్టిన మూడో ఆటగాడిగా కోహ్లీ చరిత్రకెక్కాడు. ఏప్రిల్ 23వ తేదీన రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు మధ్య జరిగిన మ్యాచులో కోహ్లీ ఈ రికార్డును అందుకున్నాడు. 

వంద క్యాచులు..

బెంగళూరు చినస్వామి స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ గోల్డెన్ డక్‌ అయ్యాడు. అయితే బ్యాటింగ్ లో విఫలమైనా ఫీల్డింగ్లో సత్తా చాటాడు. రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్లు యశస్వి జైస్వాల్,  దేవదత్ పడిక్కల్‌లు ఇచ్చిన క్యాచులను ఒడిసిపట్టుకున్నాడు. దీంతో ఐపీఎల్ లో వంద క్యాచులు పూర్తి చేసుకున్నాడు. అంతేకాదు బెంగుళూరు జట్టు తరపున వంద క్యాచులు పట్టిన ఏకైక ఆటగాడిగానూ కోహ్లీ రికార్డు నెలకొల్పాడు.  

మూడో ఆటగాడు..

ఐపీఎల్ లో ఇప్పటి వరకు కోహ్లీ 228 మ్యాచ్‌ల్లో 101 క్యాచ్‌లు పట్టాడు. కోహ్లీ కంటే ముందు  సురేష్ రైనా (204 మ్యాచ్‌ల్లో 109 క్యాచ్‌లు),  ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ (103 క్యాచ్‌లు) ఉన్నారు. 

పరుగుల వరద..

ఐపీఎల్ 2023లో కోహ్లీ బ్యాటింగ్ లో దుమ్మురేపుతున్నాడు. ఏడు మ్యాచ్‌లలో 46.50 సగటుతో 279 పరుగులు చేశాడు. ఈ  టోర్నమెంట్‌లో ఇప్పటివరకు నాలుగు హాఫ్ సెంచరీలు చేశాడు, అత్యుత్తమ స్కోరు 82*. అతని స్ట్రైక్ రేట్ 141.62.

సూపర్ విక్టరీ..

రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో బెంగుళూరు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓడి ముందు బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 189/9 స్కోరు చేసింది. ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ్యాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (44 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 6 ఫోర్లు, 4 సిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతో 77), డుప్లెసిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (39 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 8 ఫోర్లు, 2 సిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతో 62) తో రాణించారు. ఆ  తర్వాత రాజస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 20 ఓవర్లలో 182/6 స్కోరుకే పరిమితమైంది. దేవదుత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పడిక్కల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (34 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 7 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో 52), యశస్వి జైస్వాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (37 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 5 ఫోర్లు, 2 సిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతో 47), ధ్రువ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జురెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (16 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 2 ఫోర్లు, 2 సిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతో 34 నాటౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) చివరి వరకు పోరాడారు.