
స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫార్మాట్ ఏదైనా రికార్డ్స్ బ్రేక్ చేయడానికి ముందు వరుసలో ఉంటాడు. ఇప్పటికే వన్డే, టెస్టుల్లో ఎన్నో రికార్డ్స్ తన పేరిట లిఖించుకున్న విరాట్.. టీ20 ఫార్మాట్ లో అరుదైన మైల్ స్టోన్ చేరుకున్నాడు. పొట్టి ఫార్మాట్ లో మొత్తం 100 హాఫ్ సెంచరీలు చేసి ఇండియా తరపున ఈ ఘనత అందుకున్న తొలి ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు. ఆదివారం (ఏప్రిల్ 13) రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో కోహ్లీ హాఫ్ సెంచరీ పూర్తి చేయడం ద్వారా ఈ ఘనతను అందుకున్నాడు. ఈ మ్యాచ్ లో 37 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన కోహ్లీ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లో కోహ్లీకి ఆరు మ్యాచ్ ల్లో ఇది మూడో హాఫ్ సెంచరీ. టీ20 క్రికెట్ లో 100 హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్న రెండో ప్లేయర్ కోహ్లీ. తొలి బ్యాటర్ గా ఆస్ట్రేలియా దిగ్గజ ఓపెనర్ డేవిడ్ వార్నర్ 108 హాఫ్ సెంచరీలతో అగ్ర స్థానంలో ఉన్నాడు. వార్నర్ తర్వాత టీ20 ఫార్మాట్ లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ప్లేయర్ గా కోహ్లీ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. బాబర్ అజామ్ (90), గేల్ (88), జోస్ బట్లర్ (86) వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు.
THE MOMENT VIRAT KOHLI REACHED HIS 100TH FIFTY IN T20S. 🐐 pic.twitter.com/PPIUajgN8l
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 13, 2025
భారత క్రికెటర్లలో రోహిత్ శర్మ (78) 9 వ స్థానంలో.. శిఖర్ ధావన్ (70) 12 వ స్థానంలో ఉన్నారు. కోహ్లీ టీ20 లకు రిటైర్మెంట్ ప్రకటించి కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. మరోవైపు వార్నర్ పాకిస్థాన్ సూపర్ లీగ్ లో కరాచీ కింగ్స్ తరపున ఆడుతూ బిజీగా ఉన్నాడు. వార్నర్ కూడా టీ20 ఫార్మాట్ కు గుడ్ బై చెప్పడంతో సమీప భవిష్యత్తులో ఈ రికార్డ్ కోహ్లీ పేరిట ఉండడం ఖాయంగా కనిపిస్తుంది. కోహ్లీ, వార్నర్ ఇద్దరూ కూడా ఐపీఎల్ లో 66 హాఫ్ సెంచరీలతో మొదటి స్థానంలో ఉన్నారు.
►ALSO READ | DC vs MI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ.. ప్లేయింగ్ 11 నుంచి డుప్లెసిస్ ఔట్!
ఐపీఎల్ మ్యాచ్ విషయానికి వస్తే కోహ్లీతో పాటు సాల్ట్ (65) హాఫ్ సెంచరీ చేయడంతో ఐపీఎల్ 2025 లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కీలక విజయాన్ని అందుకుంది.. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 173 పరుగుల డీసెంట్ టోటల్ చేయగలిగింది. లక్ష్య ఛేదనలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 17.3 ఓవర్లలో కేవలం వికెట్ మాత్రమే కోల్పోయి 175 పరుగులు చేసి గెలిచింది.
Most Fifties in T20 Cricket 🏏 pic.twitter.com/eFYp5gB4dY
— CricketGully (@thecricketgully) April 13, 2025