దేవుడ్ని దాటేసిండు.. 50వ సెంచరీతో కోహ్లీ వరల్డ్‌‌‌‌‌‌‌‌ రికార్డు

దేవుడ్ని దాటేసిండు.. 50వ సెంచరీతో కోహ్లీ వరల్డ్‌‌‌‌‌‌‌‌ రికార్డు
  •  
  • వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌లో హయ్యెస్ట్‌‌‌‌‌‌‌‌ స్కోరు చేసిన తొలి ప్లేయర్‌‌‌‌‌‌‌‌

వెలుగు స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌ డెస్క్‌‌‌‌‌‌‌‌: ఏళ్లకు ఏళ్లు ఎదురుచూపుల్లేవు.. రికార్డుల కోసం ఆడిన దాఖలాల్లేవు. వరల్డ్‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌ను జయించాలన్న కోరికా లేదు..! కానీ.. క్రీజులోకి వస్తే వేటగాడు.. బ్యాట్‌‌‌‌‌‌‌‌ పట్టుకుంటే సూపర్‌‌‌‌‌‌‌‌ స్టార్‌‌‌‌‌‌‌‌.. ఆట మొదలుపెడితే అతనో రన్‌‌‌‌‌‌‌‌ మెషిన్‌‌‌‌‌‌‌‌.. క్రీజులో నిలబడితే సెంచరీలు.. చివరి వరకు ఉంటే రికార్డుల జేజేలు..! ఒక్క మ్యాచ్‌‌‌‌‌‌‌‌ ఆడినా ఏదో ఓ రికార్డు రావాల్సిందే.. ఒక్క సిరీస్‌‌‌‌‌‌‌‌ ఆడినా ఏదో ఓ వరల్డ్‌‌‌‌‌‌‌‌ రికార్డు బ్రేక్‌‌‌‌‌‌‌‌ కావాల్సిందే..! 15 ఏళ్ల కెరీర్‌‌‌‌‌‌‌‌.. టన్నుల కొద్దీ పరుగులు.. లెక్కకు మించిన రికార్డులు.. అంచనాలకు అందని రివార్డులు.. క్రికెట్‌‌‌‌‌‌‌‌కే ‘కింగ్‌‌‌‌‌‌‌‌’గా మారిన విరాట్‌‌‌‌‌‌‌‌ కోహ్లీ.. తాజాగా తన ఆటతో ‘క్రికెట్‌‌‌‌‌‌‌‌ దేవుడు’ సచిన్​నుదాటేశాడు. 

వన్డేల్లో అత్యధిక సెంచరీ (50)లు చేసిన తొలి ప్లేయర్‌‌‌‌‌‌‌‌గా వరల్డ్‌‌‌‌‌‌‌‌ రికార్డును సృష్టించాడు. క్రికెట్‌‌‌‌‌‌‌‌ కోసమే పుట్టినట్లుగా.. ఆటకే ఆభరణంగా.. కోహీనూర్‌‌‌‌‌‌‌‌లాంటి వన్నె తగ్గని ఎన్నో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లతో కింగ్‌‌‌‌‌‌‌‌ కోహ్లీ మరోసారి వరల్డ్‌‌‌‌‌‌‌‌ ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌ మదిని దోచుకున్నాడు.

సెల్యూట్‌‌‌‌‌‌‌‌ చేయాల్సిందే..

2008లో శ్రీలంకపై వన్డే డెబ్యూ చేసిన విరాట్‌‌‌‌‌‌‌‌ 15 ఏళ్లలో ఎంతో మారాడు. ఆరంభంలో పడిన కష్టాలను చూస్తే టీమ్‌‌‌‌‌‌‌‌లో ఎప్పుడో చోటు కోల్పోవాలి. కానీ సచిన్‌‌‌‌‌‌‌‌ స్ఫూర్తిగా ధోనీ అండగా ఆటకే  రారాజుగా మారాడు. తనలో ఉన్న ప్రతిభకు పదును పెడుతూ తనకు మాత్రమే సాధ్యమైన ఆటతో ప్రపంచాన్ని జయించాడు. పారే నదిలా నిలకడగా రన్స్‌‌‌‌‌‌‌‌ చేస్తూ.. మధ్యలో పెను తుపానులా సెంచరీలు బాదుతూ.. అప్పుడప్పుడు సునామీలా రికార్డులు బద్దలుకొడుతూ టీమిండియా రన్‌‌‌‌‌‌‌‌ మెషిన్‌‌‌‌‌‌‌‌గా మారిపోయాడు. అందుకే ఫార్మాట్‌‌‌‌‌‌‌‌ ఏదైనా.. ప్రత్యర్థి ఎవరైనా క్రీజులో కింగ్‌‌‌‌‌‌‌‌ కోహ్లీ ఉన్నాడంటే సలాం కొట్టాల్సిందే. 

ఎంత ఎదిగినా.. 

ఆటలో దూకుడు ఉంటుంది. ప్రత్యర్థులపై కన్నెర చేసే నైజం కనిపిస్తుంది. కానీ బ్యాట్‌‌‌‌‌‌‌‌ పక్కనబెడితే విరాట్‌‌‌‌‌‌‌‌ ఓ అద్భుతమైన మనిషి. చిన్నా పెద్ద తేడా లేకుండా ప్రతీ ప్లేయర్‌‌‌‌‌‌‌‌ను గౌరవించడం, ఆటలో ఎదగడానికి అతనికి సహకరించడం విరాట్‌‌‌‌‌‌‌‌కు ఉన్న అతి గొప్ప లక్షణం. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలనే తత్వమే విరాట్‌‌‌‌‌‌‌‌ను క్రికెట్‌‌‌‌‌‌‌‌ ప్రపంచంలో హీరోను చేసింది. అందుకే మాస్టర్‌‌‌‌‌‌‌‌ నుంచి ఓ ప్రశంస ఇలా జాలువారింది. 

‘ఇండియన్‌‌‌‌‌‌‌‌ డ్రెస్సింగ్‌‌‌‌‌‌‌‌ రూమ్‌‌‌‌‌‌‌‌లో నిన్ను తొలిసారి కలిసినప్పుడు మిగతా వాళ్లు నా పాదాలను తాకమని నీకు చెప్పారు. అది సంప్రదాయం, ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పినప్పుడు నేను నవ్వు ఆపుకోలేకపోయా. కానీ నీ ఆట, అభిరుచి, నైపుణ్యంతో నా హృదయాన్ని తాకావు. అప్పటి కుర్రాడు ఇప్పుడు విరాట్‌‌‌‌‌‌‌‌గా ఎదిగినందుకు చాలా సంతోషిస్తున్నా. నా రికార్డును ఓ ఇండియన్‌‌‌‌‌‌‌‌ బద్దలు కొట్టినందుకు గర్వంగా ఉంది. వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌ సెమీస్‌‌‌‌‌‌‌‌లో, అది నా హోమ్‌‌‌‌‌‌‌‌ గ్రౌండ్‌‌‌‌‌‌‌‌లో ఈ రికార్డు సృష్టించినందుకు హ్యాపీగా ఉంది’ అంటూ సచిన్‌‌‌‌‌‌‌‌ ట్వీట్‌‌‌‌‌‌‌‌ చేశాడు. 

10 రోజుల్లోనే..

రెండు దశాబ్దాలకు పైగా క్రికెట్‌‌‌‌‌‌‌‌ను శాసించిన సచిన్‌‌‌‌‌‌‌‌ వంద సెంచరీలు సాధించాడు. కానీ 49 నుంచి 50 సెంచరీ అందుకోవడానికి మాస్టర్‌‌‌‌‌‌‌‌కు 365 రోజులు పట్టింది. అదే విరాట్‌‌‌‌‌‌‌‌కు రోజులే అవసరం అయ్యాయి. ఈ నెల 5న సౌతాఫ్రికాపై 49వ సెంచరీ చేసిన కోహ్లీ 10 రోజుల్లోనే 50వ శతకం బాదేశాడు. ఈ మొత్తం 50 సెంచరీల్లో ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లోనే 27 చేశాడు. అందుకే క్రికెట్‌‌‌‌‌‌‌‌లో కోహ్లీని ‘ఛేజ్‌ కింగ్’ అని ముద్దుగా పిలుచుకుంటారు.  తను ఛేజింగ్‌లోనే కాదు క్రికెట్‌కే కింగ్!

ఇదంతా ఓ కలలా అనిపిస్తోంది. నా వైఫ్​ అనుష్క,  నా హీరో సచిన్‌‌‌‌‌‌‌‌ ఇక్కడే ఉన్నారు. వారి మధ్య చరిత్రాత్మక వాంఖడేలో 50వ సెంచరీ కొట్టడం చాలా ఆనందంగా ఉంది. ఈ ఫీలింగ్‌‌‌‌‌‌‌‌ను ఎలా వర్ణించాలో కూడా అర్థం కావడం లేదు. ఇలాంటి పెద్ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో 330, 340 స్కోర్లు చేయడం చాలా గొప్ప విషయం. ఈ క్రెడిట్‌‌‌‌‌‌‌‌ శ్రేయస్‌‌‌‌‌‌‌‌కు చెందుతుంది. రోహిత్‌‌‌‌‌‌‌‌, గిల్‌‌‌‌‌‌‌‌ ఇచ్చిన స్టార్టింగ్‌‌‌‌‌‌‌‌కు రాహుల్‌‌‌‌‌‌‌‌ ఇచ్చిన ఫినిషింగ్‌‌‌‌‌‌‌‌ సూపర్‌‌‌‌‌‌‌‌. 

ప్రతి ఒక్కరు తమ పాత్రలను పరిపూర్ణంగా పోషించారు.  ఇందులోనూ నా పాత్ర సమర్థంగా పోషించా.  ప్రతిది చాలా చక్కగా కలిసి వచ్చినందుకు సంతోషంగా ఉంది. సింగిల్స్‌‌‌‌‌‌‌‌, డబుల్స్‌‌‌‌‌‌‌‌ తీసినా, బౌండరీలు కొట్టినా జట్టు కోసమే. టీమ్‌‌‌‌‌‌‌‌ను గెలిపించడమే నా కర్తవ్యం. 

- విరాట్‌‌‌‌‌‌‌‌ కోహ్లీ