న్యూఢిల్లీ : టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ (6) రంజీ మ్యాచ్‌లోనూ ఫెయిలయ్యాడు. రైల్వేస్ బౌలర్ హిమాన్షు సాంగ్వాన్ (2/46) వేసిన ఆఫ్ సైడ్ బాల్‌ను ఆడే క్రమంలో బౌల్డ్ అయ్యాడు. అయితే కెప్టెన్ ఆయూష్ బదోనీ (99), సుమిత్ మాథూర్ (78 బ్యాటింగ్) నిలకడగా ఆడటంతో.. 41/1 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన ఢిల్లీ తొలి ఇన్నింగ్స్‌లో 96 ఓవర్లలో 334/7 స్కోరు చేసింది.
సుమిత్‌తో పాటు సిద్ధాంత్ శర్మ (15 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. సనత్ సాంగ్వాన్ (30), యష్ దూల్ (32), ప్రణవ్ (39) తొందరగానే ఔట్ కావడంతో ఓ దశలో ఢిల్లీ 97/4తో కష్టాల్లో పడింది. అయితే బదోనీ, సుమిత్ ఐదో వికెట్‌కు 133 రన్స్ జోడించి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. హిమాన్షు సాంగ్వాన్, కునాల్ యాదవ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ప్రస్తుతం ఢిల్లీ 93 రన్స్ ఆధిక్యంలో కొనసాగుతోంది.