మసాలాకు ముగింపునిస్తున్నాం.. కుండబద్ధలు కొట్టిన కోహ్లీ, గంభీర్

మసాలాకు ముగింపునిస్తున్నాం.. కుండబద్ధలు కొట్టిన కోహ్లీ, గంభీర్

చెన్నై: తమ మధ్య సంబంధం గురించి బయట జరుగుతున్న ప్రచారానికి టీమిండియా హెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గౌతమ్ గంభీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, విరాట్ కోహ్లీ పుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టాప్ పెట్టారు. బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌తో టెస్టు సిరీస్ ముంగిట బీసీసీఐ టీవీ కోసం ఈ ఇద్దరూ ఒక్క చోటకు వచ్చి మనసు విప్పి మాట్లాడుకున్నారు.  తాము కలిసి ఆడిన రోజులు, టెస్ట్‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌, టీమిండియాపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఇద్దరూ భాగమైన 2011 వన్డే వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విక్టరీ వీడియోను చూసిన తర్వాత వీళ్ల మధ్య సంభాషణ మొదలైంది.

ఈ సందర్భంగా ‘మా గురించి ప్రచారంలో ఉన్న మసాలాకు ఇక్కడ ముగింపునిస్తున్నాం’ అని కోహ్లీ చెప్పగా..  సంభాషణ మొదలు పెట్టేందుకు ఇది మంచి ఆరంభం అంటూ గౌతీ బదులిచ్చాడు. తాను ఇండియా కోచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వస్తానని అస్సలు ఊహించలేదని, కొన్ని నెలల ముందు వరకూ ఆ ఆలోచనే లేదని విరాట్ ప్రశ్నకు గంభీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జవాబిచ్చాడు. ఈ సందర్భంగా ఇద్దరి దైవ భక్తి గురించి కూడా చెప్పాడు.

2014లో ఆస్ట్రేలియాలో ఆడిన టెస్టు సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రతి బంతిని ఎదుర్కొనే ముందు ‘ఓం నమ: శివాయ’ జపిస్తున్నానని కోహ్లీ తనకు చెప్పిన విషయాన్ని గంభీర్ గుర్తు చేశాడు. ఇదే విధంగా నేపియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో టెస్టు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రెండున్నర రోజుల పాటు క్రీజులో ఉండి జట్టును ఆదుకున్న  సందర్భంలో  తాను హనుమాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాలీసా తప్ప వేరే ఏదీ వినలేదని గౌతీ  తెలిపాడు.