వరల్డ్ కప్ లో భారత్ బ్యాటర్లు మరోసారి సత్తా చాటారు. శ్రీలంకపై చెలరేగి ఆడి భారీ స్కోర్ చేశారు. ముంబైలోని వాంఖడేలో జరుగుతన్న ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. గిల్ 92 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. కోహ్లీ 88 పరుగులు చేసాడు. శ్రేయాస్ అయ్యర్ 56 బంతుల్లోనే 82 పరుగులు చేసి భారత్ కు భారీ స్కోర్ అందించాడు. లంక బౌలర్లలో మదుషాంకా 5 వికెట్లు తీసుకోగా.. చమీరకు ఒక వికెట్ దక్కింది.
ఆ ఇద్దరే నిలబెట్టారు
ఈ టోర్నీలో వరుసగా రెండోసారి బ్యాటింగ్ చేస్తున్న భారత్ కు తొలి ఓవర్ రెండో బంతికే షాక్ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ తొలి బంతికే ఫోర్ కొట్టి రెండో బంతికి బౌల్డయ్యాడు. ఇక ఈ దశలో గిల్ కు జత కలిసిన కోహ్లీ భారీ భాగస్వామ్యాన్ని నిర్మించాడు. రెండో వికెట్ కు 189 పరుగుల భారీ భాగస్వామ్యం తర్వాత స్వల్ప వ్యవధిలో కోహ్లీ, గిల్ ఔటయ్యి తృటిలో తమ సెంచరీలను కోల్పోయారు.
అయ్యర్ ఒంటరి పోరాటం
ఈ టోర్నీలో పెద్దగా ప్రభావం చూపించని అయ్యర్.. చెలరేగి ఆడాడు. రాహుల్, సూర్య కుమార్ యాదవ్, జడేజాలతో స్వల్ప భాగస్వామ్యాన్ని నిర్మించాడు. చివర్లో మెరుపు హాఫ్ సెంచరీ చేసి అయ్యర్ ఔటైనా.. జడేజా(35) బాధ్యతగా ఆడి లంక బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొని స్కోర్ ను 350 దాటించాడు.
ALSO READ : ODI World Cup 2023: అతని సలహాతోనే ధోనీని కెప్టెన్ చేశారు: బీసీసీఐ సెక్రటరీ జైషా
Will Sri Lanka be able to chase this? ?#INDvsSL | #INDvSL | #SLvsIND | #SLvIND | #IndiavsSriLanka | #CWC23 | pic.twitter.com/OifhQ41CrD
— Fast Live Line (@FastLiveLine) November 2, 2023