ఆసియా కప్ 2023లో భాగంగా శనివారం (సెప్టెంబర్ 2) ఇండియా - పాకిస్తాన్ తలపడనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ కు ముందు భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. పాకిస్తాన్ జట్టు బలాబలాల గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఆ జట్టు బలం బౌలింగే అన్న కోహ్లీ.. వారిని ఎదుర్కోవాలంటే అత్యుత్తమ ఆట ఆడటమే మార్గమని తెలిపాడు.
ALSO READ:వన్ నేషన్ -వన్ ఎలక్షన్.. గతంలో ఎప్పుడైనా జరిగాయా .. !
గతేడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచ కప్‌లో ఇదే పాక్ బౌలింగ్ ను విరాట్ చిత్తు చేసిన విషయం తెలిసిందే. 53 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 82 పరుగులు చేసిన విరాట్.. ఇండియాకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. శనివారం జరిగే మ్యాచ్ లో అభిమానులు.. అతని నుంచి అలాంటి ఇన్నింగ్స్ మరోసారి ఆశిస్తున్నారు. ఈ క్రమంలో హై ఓల్టేజ్ పోరుకు ముందు స్టార్ స్పోర్ట్స్ తో మాట్లాడిన కోహ్లీ.. పాక్ బౌలింగ్ ను ఎదుర్కోవడం కష్టమే అన్నట్లు వ్యాఖ్యానించాడు.
"సమిష్టిగా అనిపించినప్పటికీ.. బౌలింగ్ వారి బలమని నేను భావిస్తాను. జట్టులో చాలా మంచి బౌలర్లు ఉన్నారు. వారు ఎప్పుడైనా మలుపు తిప్పగలరు. వాటిని ఎదుర్కోవాలంటే బ్యాటర్ ఎవరైనా అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శించాల్సిందే.." అని కోహ్లి అన్నాడు.
ALSO READ:వన్ నేషన్..వన్ ఎలక్షన్.. రామ్ నాథ్ కోవింద్ తో జేపీ నడ్డా భేటీ
ఇక ఇటీవల కాలంలో కోహ్లీ వన్డే ఫార్మాట్ లో అధ్భుతమైన ఫామ్ లో ఉండటం ఇండియాకు ఊరట కలిగించే విషయం. గత 13 వన్డే ఇన్నింగ్స్ లలో 50.36 సగటుతో 554 పరుగులు చేశాడు.
వర్షం ముప్పు
ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ జరగాల్సిన శ్రీలంకలోని పల్లెకెలెలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం కూడా వర్షం అడ్డుతగిలే అవకాశం ఉంది. సుమారు 90 శాతం వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.