T20 World Cup 2024: బంగ్లాతో టీమిండియా వార్మప్ మ్యాచ్.. ఓపెనర్, వికెట్ కీపర్‌పై సస్పెన్స్

T20 World Cup 2024: బంగ్లాతో టీమిండియా వార్మప్ మ్యాచ్.. ఓపెనర్, వికెట్ కీపర్‌పై సస్పెన్స్

టీ20 ప్రపంచకప్ సమరానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. నిన్నటి వరకు రోజులు పోయి ఇప్పుడు గంటలు లెక్కపెట్టుకోవాల్సిన సమయం వచ్చింది. ఆదివారం(జూన్ 2) ఉదయం 6 గంటల నుంచి ఈ మెగా టోర్నీ ప్రధాన మ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి. అయితే టీ20 ప్రపంచ కప్ కు కొన్ని గంటల ముందు టీమిండియా బంగ్లాదేశ్ తో వార్మప్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. శనివారం (జూన్ 1) భారత్- బంగ్లాదేశ్ జట్ల మధ్య జరగనున్న మ్యాచే.. ఆఖరి వార్మప్ గేమ్.

న్యూయార్క్‌లోని నాసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ప్రధాన మ్యాచ్‌లకు ముందు భారత జట్టు ఆడే ఏకైక వార్మప్ గేమ్ ఇదే. ఇప్పటికే భారత ఆటగాళ్లందరూ అమెరికా చేరుకొని ప్రాక్టీస్ లో నిమగ్నమయ్యారు. ఇది వార్మప్ మ్యాచ్ అయినా ఈ మ్యాచ్ ను మన జట్టు సీరియస్ గా తీసుకున్నట్లుగా అర్ధమవుతుంది. ఈ మ్యాచ్ కు ముందు రోహిత్ సైతం అమెరికాలోని పరిస్థితులను అర్ధం చేసుకోవటానికి మాకు ఇదొక చక్కని అవకాశం అని చెప్పుకొచ్చాడు. అయితే ఈ మ్యాచ్ కు ముందు భారత్ తుది జట్టుపై ఆసక్తి నెలకొంది. 

Also Read:క్రికెట్ నుంచి ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ సస్పెండ్.. కారణం ఏంటంటే..?

కొంతకాలం నుంచి టీ20 వరల్డ్ కప్ లో విరాట్ కోహ్లీ ఓపెనర్ గా బరిలోకి దిగుతాడని ప్రచారం కొనసాగింది. ఐపీఎల్ లో కోహ్లీ అదరగొట్టడంతో వరల్డ్ కప్ లో ఓపెనింగ్ కన్ఫర్మ్ అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఇప్పటివరకు కోహ్లీ ఒకటి రెండు మ్యాచ్ లు మినహాయిస్తే అంతర్జాతీయ టీ20ల్లో బ్యాటింగ్ చేయలేదు. దీంతో రోహిత్ కు జోడీగా లెఫ్ట్ హ్యాండర్ యశస్వి జైస్వాల్ బరిలోకి దిగే అవకాశముందని మరికొందరు భావిస్తున్నారు. 

వార్మప్ మ్యాచ్ లో భారత వికెట్ కీపర్ ఎవరనే విషయంలో సస్పెన్స్ కొనసాగుతుంది. సంజు సామ్సన్, రిషబ్ పంత్ సూపర్ ఫామ్ లో ఉండడంతో వీరిద్దరిలో ఎవరికి చోటు దక్కుతుందో ఆసక్తిగా మారింది. ఎటాకింగ్ చేయడంలో పంత్ ముందుంటాడు. మరోవైపు శాంసన్ ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగలడు. దీంతో వీరిద్దరి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఫాస్ట్ బౌలర్ల విషయంలో ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగుతారా .. లేకపోతే బ్యాటింగ్ డెప్త్ కోసం ముగ్గురు స్పిన్నర్లను ఆడిస్తారా అనే విషయం తేలాల్సి ఉంది.  

  • మ్యాచ్ వివరాలు: భారత్ vs బంగ్లాదేశ్
  • వేదిక: నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, న్యూయార్క్
  • తేదీ, సమయం: జూన్ 1న రాత్రి 8 గంటలకు.
  • టీవీలో ప్రత్యక్ష ప్రసారాలు: స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్
  • డిజిటల్: డిస్నీ + హాట్‌స్టార్ యాప్

భారత జట్టు: రోహిత్ శ‌ర్మ(కెప్టెన్), య‌శ‌స్వి జైస్వాల్, సూర్యకుమార్ యాద‌వ్, విరాట్ కోహ్లీ, రిష‌భ్ పంత్(వికెట్ కీప‌ర్), సంజూ శాంస‌న్(వికెట్ కీప‌ర్), హార్దిక్ పాండ్యా, శివం దూబే, ర‌వీంద్ర జ‌డేజా, అక్షర్ ప‌టేల్, కుల్దీప్ యాద‌వ్, య‌జ్వేంద్ర చాహ‌ల్, అర్ష్‌దీప్ సింగ్, జ‌స్ప్రీత్ బుమ్రా, సిరాజ్‌.

రిజర్వ్ ప్లేయర్స్: శుభ్ మాన్ గిల్, రింకు సింగ్, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్. 

బంగ్లాదేశ్ జట్టు: నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), తస్కిన్ అహ్మద్, లిట్టన్ దాస్, సౌమ్య సర్కార్, తాంజిద్ హసన్ తమీమ్, షకీబ్ అల్ హసన్, తౌహిద్ హృదయ్, మహమ్మదుల్లా, జాకర్ అలీ, తన్వీర్ ఇస్లాం, షేక్ మహేదీ హసన్, రిషాద్ హుస్సేన్, ముస్తాఫిజుర్ రెహమాన్, షోరిఫుల్ ఇస్లాం, తంజిమ్ హసన్. 

రిజర్వ్ ప్లేయర్స్: అఫీఫ్ హుస్సేన్, హసన్ మహ్మద్.