Virat Kohli: ఇమ్రాన్ హష్మీకి లిప్స్.. కోహ్లీకి స్లిప్స్: ఇది మామూలు ట్రోలింగ్ కాదు

Virat Kohli: ఇమ్రాన్ హష్మీకి లిప్స్.. కోహ్లీకి స్లిప్స్: ఇది మామూలు ట్రోలింగ్ కాదు

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. భారత జట్టులో వీరి గురించే చర్చంతా. విశాంత్రి పేరుతో హిట్ మ్యాన్‌ను కూర్చోబెట్టిన.. సత్తా నిరూపించుకోవడానికి విరాట్‌కు మరో అవకాశమిచ్చారు. కానీ, మన పరుగుల యంత్రం పొడిసిందేమీ లేదు. గోల్డెన్ డక్ నుంచి అంపైర్  బయటపడేసిన సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఎప్పటిలానే స్లిప్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 

ప్రస్తుత బోర్డర్ -గవాస్కర్ ట్రోఫీ సిరీస్ లో కోహ్లీ స్లిప్‌లో ఔటైన సందర్భాలు ఏడు. వికెట్ల అవతల వెళ్తున్న బంతులను వేటాడి మరీ ఔటవుతున్నాడు. సిడ్నీ టెస్టులోనూ అదే తీరు. తన బలహీనతను మరోసారి బయటపెట్టాడు. భారత ఇన్నింగ్స్ 32 ఓవర్‌లో బోలాండ్ వేసిన ఆఫ్‌సైడ్ బంతిని ఆడబోయి వెబ్‌స్టర్ చేతికి చిక్కాడు. ఇంకేముంది అభిమానులు అతన్ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. 

Also Read :- పంత్‌ ఒళ్లంతా కుళ్లబొడిచారు కదయ్యా

హష్మీకి లిప్స్.. కోహ్లీకి స్లిప్స్

ఇమ్రాన్ హష్మీ పెదవులను ఇష్టపడినట్లుగా కోహ్లీ స్లిప్‌లను ఇష్టపడతాడని ఒక నెటిజెన్ చమత్కరించారు. వికెట్ల అవతల వెళ్తున్న బంతులను ఎలా వదిలేయాలనేది భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని నుంచి నేర్చుకోవాలని మరొక నెటిజెన్ సూచించారు.

ఇక సిడ్నీ టెస్టు విషయానికొస్తే, తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 185 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది. రిషబ్ పంత్(40).. టాప్ స్కోరర్. ఆసీస్‌ బౌలర్లలో స్కాట్ బోలాండ్ 4, స్టార్క్ 3, కమిన్స్ 2 వికెట్లు పడగొట్టారు.