భారత క్రికెట్లో ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. వీరిద్దరు మైదానంలో ఉన్నప్పుడు సహచరుల్లా కాదు..బెస్ట్ ఫ్రెండ్స్లా కనిపిస్తారు. మైదానం బయట కుటుంబ సభ్యుల్లా కలిసుంటారు. అయితే విరాట్ కోహ్లీ ధోని కెప్టెన్సీలోనే టీమిండియాలోకి అరంగేట్రం చేశాడు. ధోని రిటైర్ అయ్యాక కెప్టెన్గా మారాడు. ఈ నేపథ్యంలో ధోనితో తనకున్న అనుబంధాన్ని RCB పోడ్‌కాస్ట్‌లో కోహ్లీ పంచుకున్నాడు.
నేను ధోని రైడ్ హ్యాండ్..
తాను ఎప్పటికీ ధోనికి రైడ్ హ్యాండ్ను అని కోహ్లీ అన్నాడు. ధోనికి తనకు మధ్య ఉన్న నమ్మకం, క్లారిటీ ఎక్కువ అని చెప్పాడు. అందుకే అతనితో ఏ విషయాన్ని అయినా పంచుకుంటానని వెల్లడించాడు.
ధోని ఫోన్ చేస్తే ఎత్తడు..!
ధోనిని కలవడం కష్టమైన పని అని కోహ్లీ చెప్పాడు. ధోనిని కలవాలంటే అతని దగ్గరకే వెళ్లాలి. కాల్ చేస్తే లిఫ్ట్ చేయడని తెలిపాడు. ఫోన్ ఎక్కడో పడేసి తన పని తాను చూసుకుంటాడని వివరించాడు. అందుకే ధోని, తాను ఎప్పుడో ఒకసారి మాత్రమే కలుస్తామన్నాడు.
ఆ మేసేజ్ ఎప్పటికీ మర్చిపోలేను..
ధోనీ తనకు ఎప్పుడూ అండగా ఉంటాడని కోహ్లీ పేర్కొన్నాడు. టెస్టు కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన సమయంలో ధోని మాత్రమే తనకు మేసేజ్ పంపాడని గుర్తు చేశాడు. ధోనీ పంపిన మెసేజ్ ఎప్పటికీ మరిచిపోలేననన్నాడు. తానేం చెప్పకపోయినా తాను ఏ పొజిషన్‌లో ఉన్నాడో.. ఎలాంటి మెంటర్ టార్చర్ అనుభవిస్తున్నానో ధోనీ అర్థం చేసుకున్నాడని చెప్పాడు.
ధోని ఏం మెసేజ్ పెట్టాడంటే..?
నువ్వు దృఢంగా ఉండాలని అనుకుంటే..ముందు నిన్ను నువ్వు దృఢమైన వ్యక్తిగా చూడు. అది ఎలాగంటే నీ చుట్టూ ఉన్నవాళ్లు ఎలా ఉన్నారని అడగడం కూడా మరిచిపోవాలి... అని ధోని మెసేజ్ పెట్టినట్లు కోహ్లీ చెప్పాడు. ధోనీ పంపిన ఈ మెసేజ్...అతను చెప్పిన మాటలు..కుటుంబ సభ్యుడు చెప్పిన ఫీలింగ్ వచ్చిందని తెలిపాడు. ధోని చాలా స్ట్రాంగ్.. మెంటల్ ఇంకా స్ట్రాంగ్ అని ప్రశంసించాడు. ఎలాంటి పరిస్థితులనైనా నవ్వుతూ ఢీల్ చేస్తాడన్నాడు.
నేను ఫెయిల్యూర్ కెప్టెన్ని కాదు..
తాను ఎప్పటికీ ఫెయిల్యూర్ కెప్టెన్ని కాదని కోహ్లీ తెలిపాడు. తన కెప్టెన్సీలో భారత జట్టు 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కి అర్హత సాధించిందని గుర్తు చేశాడు. అలాగే 2019 వన్డే వరల్డ్ కప్ సెమీస్లో అడుగుపెట్టామన్నాడు. దీంతో పాటు వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడినట్లు వివరించాడు. అయినా అందరూ తనను ఫెయిల్యూర్ కెప్టెన్‌గానే చూశారని....నవ్వుతూ చెప్పాడు.