కోహ్లీ.. కోహ్లీ.. క్రికెట్ ప్రపంచంలో ఈ పేరుకు, ఈ ఆటగాడికి ఉన్న క్రేజ్ గురుంచి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటీవలే 15 ఏళ్ల క్రికెట్ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న ఈ మాజీ సారథి.. ప్రస్తుతం హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్నారు. ఒకవైపు ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటూ మరోవైపు అలీబాగ్‌లో తన ఫామ్‌హౌజ్ నిర్మాణ పనులను సమీక్షిస్తున్నారు.
ఇదిలావుంటే కోహ్లీపై ఉన్న అభిమానంతో అతనికి వజ్రాల పొదిగిన బ్యాట్‌ను బహుమతిగా అందించనున్నాడు సూరత్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త. బ్యాట్ తయారీకి ల్యాబ్‌లో తయారుచేసిన డైమండ్స్ కాకుండా సహజసిద్ధమైన వజ్రాన్ని వాడారట. 1.04 క్యారట్ల ఒరిజినల్ డైమండ్‌తో తయారు చేశారట. 15 మిల్లీమీటర్ల పొడవుండే ఈ బ్యాట్ ఖరీదు దాదాపు రూ.10 లక్షలు ఉండొచ్చని సమాచారం.
DIAMOND BAT ?
— BINGESPORTS (@BINGESPORTS_) August 18, 2023
.
.
.#BAT #DIAMONDBAT #ViratKohli #kohli #legend #gift #premium #premiumbat #cricket #cricketinfo #WorldCup2023 pic.twitter.com/IQypGC3E8S
ఇప్పటికే ఈ డైమండ్ బ్యాట్ తయారీ పూర్తైనట్లు తెలుస్తోంది. సూరత్‌కు చెందిన ప్రముఖ వజ్రాల కంపెనీ లెక్సస్ సాఫ్ట్‌మాక్ కంపెనీ డైరెక్ట్ ఉత్పల్ మిస్త్రీ ఆధ్వర్యంలో ఈ బ్యాట్ ను తయారు చేశారట. ప్రస్తుతం దీన్ని సర్టిఫికేషన్ కోసం పంపినట్లు కంపెనీ తెలిపింది. అక్కడినుంచి అనుమతులు రాగానే దాన్ని కోహ్లీకి అందించనున్నారు.
త్వరలోనే భారత జట్టు ఆసియా కప్ 2023 టోర్నీ కోసం శ్రీలంకకు బయలుదేరి వెళ్లనుంది. ఈ టోర్నీ ముగిసిన వెంటనే స్వదేశంలో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ జరగనుంది. ఆపై వన్డే వరల్డ్ కప్ 2023 సన్నాహకాలు ప్రారంభం కానున్నాయి.